Categories: FeaturedMovie News

Puri Jagnnath: పూరీ జగన్నాథ్ కి కండీషన్స్ పెట్టిన మెగాస్టార్ చిరంజీవి… పూరీ రియాక్షన్ ఏంటంటే?

Puri Jagnnath: టాలీవుడ్ ఇండస్ట్రీ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి పూరీ జగన్నాథ్ క్రేజ్ పెంచితే మరికొన్ని సినిమాలు డిజాస్టర్ గా నిలిచి పూరీ స్టార్డం మీద దెబ్బ కొట్టాయి. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన లైగర్ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచి ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ కి అవకాశాలను దూరం చేసింది.

భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన లైగర్ సినిమా మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. ఈ సినిమా వల్ల పూరి జగన్నాథ్ ఆర్థికంగా కూడా చాలా నష్టపోయాడు. ఇక దర్శకుడిగా పూరి జగన్నాథ్ కి అవకాశాలు ఇవ్వటానికి హీరోలు కూడా వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి పూరి జగన్నాథ్ కి అవకాశం ఇవ్వటానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు ఎంతోమంది దర్శకులకు అవకాశం ఇచ్చిన చిరంజీవి ఇప్పుడు పూరి జగన్నాథ్ కి కూడా ఒక అవకాశం ఇవ్వాలని భావించినట్లు సమాచారం. పూరి జగన్నాథ్ కూడా చాలా కాలంగా చిరంజీవితో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాడు. అయితే పూరి జగన్నాథ్ కి చిరంజీవి అవకాశం ఇవ్వటానికి కొన్ని కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది.

Puri Jagnnath: వంద రోజుల్లో కథ పూర్తి చేసి పెట్టాలి…


ప్రస్తుతం చిరంజీవి వరస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో వంద రోజుల్లో కథ వినిపించి తనను మెప్పిస్తే ఖచ్చితంగా సినిమా చేస్తానని పూరి జగన్నాథ్ కి చిరంజీవి కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కథ నచ్చిన కూడా కేవలం వంద రోజులలో షూటింగ్ పూర్తి చేయాలని కండిషన్ పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం. చిరంజీవి ఇచ్చిన ఈ అవకాశాన్ని పూరి జగన్నాథ్ ఎలా సద్వినియోగం చేసుకుంటాడు చూడాలి మరి. ఒకవేళ చిరంజీవిని మెప్పించే కథ సిద్ధం చేసి వంద రోజులలో షూటింగ్ పూర్తి చేస్తే పూరీ జగన్నాథ్ కి ఇండస్ట్రీలో మళ్ళీ అవకాశాలు లభించే అవకాశం ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago