Pushpa 2: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలెబ్రెటీల తమ సినిమా విషయంలో ఎన్నో రకాల సెంటిమెంట్లను ఫాలో అవుతారు. సినిమాను హిట్ చేసుకోవడం కోసం ఈ విధమైనటువంటి సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారనే విషయం మనకు తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ కూడా పుష్ప 2 సినిమా విషయంలో సెంటిమెంట్ ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.
మరి అల్లు అర్జున్ కి ఉన్నటువంటి ఆ సెంటిమెంట్ ఏంటి అనే విషయానికి వస్తే.. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పాట్నా, చెన్నై, ముంబై వంటి ప్రాంతాలలో పెద్ద వేడుకలను నిర్వహించారు. ఇక తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను యూసఫ్ గూడా గ్రౌండ్స్ లో జరపనున్నారు ఇలా ఈ వేడుక ఇక్కడ జరుగుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి ఈ వేడుకను ఎక్కడ నిర్వహించాలనే విషయం గురించి ఎన్నో ప్లేసులను సెర్చ్ చేసినప్పటికీ చివరికి యూసఫ్ గూడ గ్రౌండ్ కన్ఫామ్ కావడంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇదివరకు ఇక్కడ ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకున్న సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 1, అలా వైకుంఠపురంలో, బాహుబలి సినిమా వేడుకలు కూడా ఇక్కడే జరిగాయి. ఇలా ఈ సినిమాలన్నీ మంచి సక్సెస్ కావడంతో పుష్ప 2 సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియాల్సి ఉంది.
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…
తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…
హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…
సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…
ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…
ఇప్పటివరకు గర్భనిరోధక బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. మాత్రలు, ఇతర పద్ధతులు ఎక్కువగా మహిళలకే పరిమితమయ్యాయి. అయితే వైద్యరంగంలో తాజా…