Pushpa 2: అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ సినిమాకు మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా సీక్వెల్ చిత్రం నిర్మాణ విషయంలో మేకర్స్ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పనులలో భాగంగా షూటింగ్ పూర్తి చేసుకుని చిత్ర బృందం బస్సులో తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు.
ఈ క్రమంలోనే పలువురు ఆర్టిస్టులకు స్వల్ప గాయాలు అయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్లో భాగంగా పలువురు ఆర్టిస్టులు షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా నార్కెట్ పల్లి వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న బస్సును మరొక ప్రైవేట్ బస్సు ఢీ కొట్టింది దీంతో ఆర్టిస్టులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఇలా ప్రమాదం జరగడంతో స్పందించిన స్థానికులు గాయాల పాలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఇక ఈ ప్రమాదంలో పలువురు గాయాలు పాలయ్యారని తెలుస్తుంది. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉన్నారని కేవలం స్వల్ప గాయాలు మాత్రమే తగిలాయని తెలుస్తుంది.ఇక ఈ విషయం తెలియగానే డైరెక్టర్ సుకుమార్ హీరో అల్లు అర్జున్ క్షతగాత్రులను పరామర్శించినట్టు సమాచారం. అయితే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.
ఇక పుష్ప 2సినిమా విషయానికి వస్తే అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…