సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ పుష్ప సినిమా హ్యాట్రిక్ గా నిలవబోతోంది. ఆర్య, ఆర్య2 మరియు పుష్ప సినిమాలు వీరి కాంబినేషన్ లో వచ్చినవి. అయితే ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ దశలోనే ఉంది. 80 శాతం వరకు షూటింగ్ పూర్తయినా.. ఇంకా 20 శాతం పూర్తి చేసి 2021, డిసెంబర్ 25 నాటికి ప్రేక్షకుల ముందుకు ఫస్ట్ పార్ట్ ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు దర్శక, నిర్మాతలు.
ఇదిలా ఉండగా.. పుష్ప నుంచి భారీ అప్ డేట్ ఒకటి వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి కొన్ని అప్ డేట్స్ వస్తున్నా.. హీరోయిన్ రష్మిక మందన్నా లుక్ మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు. దీంతో ఫ్యాన్స్ హీరోయిన్ లుక్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనిలో భాగంగానే హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు ముహూర్తాన్నిఖరారు చేశారు.
సెప్టెంబర్ 29 అంటే నేడు రష్మిక ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని ట్విట్టర్ వేదికగా మూవీ సభ్యులు ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఇదిలా ఉండగా.. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే. దాక్కో దాక్కో మేక సాంగ్ ఐదు భాషల్లో విడుదల చేశారు. ప్రతీ దాంట్లో పాటకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది.
ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తీస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల బన్నీ అరకు, విశాఖ ఏరియాల్లో సినిమా షూటింగ్ సమయాల్లో ఓ హోటల్లో టిఫిన్ చేసిన విషయం తెలిసిందే. అందులో అతడి సింప్లిసిటీకి ప్రతీ ఒక్కరూ ఫిదా అయ్యారు. పుష్పకు సంబంధించిన విషయం ఏదొచ్చిన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ ట్వీట్ కూడా వైరల్ అయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…