Categories: FeaturedMovie News

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ట్రైలర్‌కు, విడుదల తేదీకి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. తాజాగా ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంతో ఆ డేట్ ను వెల్లడించారు. అంతేకాదు.. ట్రైలర్ ను కూడా ఎప్పుడు విడుదల చేస్తారో కూడా తెలియజేశారు. అఖిల్ ఇంత వరకు నటించిన సినిమాల్లో ఒక్కటి కూడా బంపర్ హిట్ కొట్టలేదు. అన్నీ యావరేజ్ గానే ప్రేక్షకుల నుంచి టాక్ వినిపించింది.

ఎన్నో సార్లు ఈ సినిమా వాయిదా పడుతూ.. ఎన్నో కష్టాలను అధిగమిస్తూ.. ఇక్కడి వరకు వచ్చింది. కరోనా కారణంగా అంతకముందే ఎన్నో సార్లు విడుదల తేదీని ప్రకటించగా.. ఆ తేదీకి విడుదల చేయలేకపోయారు. దీంతో మరోసారి విడుదల తేదీని ప్రకటించారు. అదేంటంటే.. దీనిని దసరా కానుకగా.. అక్టోబర్ 15 దీనిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ట్రైలర్ ను రేపు సాయంత్రం 06.30 గంటలకు విడుదల చేస్తామని తెలిపారు. వాస్తవానికి మొదట ఈ సినిమాకు అక్టోబర్ 8 న విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ తేదీన వైష్టవ్ తేజ్ సినిమా ‘కొండపొలం’ విడుదల రానుంది. దీంతో ఈ సినిమా విడుదలను మరో వారం రోజులు ముందుకు జరిపారు. ఈ సినిమాను పండుగకు ముందు కాకుండా విజయదశమి రోజునే రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

దీనికి సంబంధించిన కొన్ని పోస్టర్స్‌ను కూడా చిత్రబృందం విడుదల చేసింది. దీనిలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అటు బొమ్మరిల్లు భాస్కర్ కు.. ఇటు అక్కినేని అఖిల్ కు ఎంతో కీలకం కానుంది. ఈ సినిమా కుటుంబకథా చిత్రంతో పాటు.. దీనిలో మంచి ఎంటర్ టైన్మెంట్ కూడా ఉందంటూ బొమ్మరిల్లు భాస్కర్ తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఎన్టీఆర్ మాట వినని హీరోయిన్.. సినిమా నుంచే తప్పుకున్న సావిత్రి

తెలుగు సినీ చరిత్రలో అగ్ర హీరోగా నిలిచిన ఎన్టీఆర్ అనేక మంది ప్రముఖ హీరోయిన్‌లతో కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాలు…

1 minute ago

పెళ్లి, సంతానం కోసం భక్తులు క్యూలు.. ఆంధ్రలోని ఈ బావి రహస్యం ఏమిటి?

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆలయాలు తమ ప్రత్యేక విశిష్టతలతో భక్తులను ఆకట్టుకుంటూ ఉంటాయి. వాటిలో కొన్నింటికి పురాణ గాథలు, మరికొన్నింటికి ఆశ్చర్యకరమైన…

2 minutes ago

ఎండలో అలసటకు ఒక్క గ్లాస్ చాలు.. చెరుకు రసం లేదా కొబ్బరి నీళ్లు?

వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీరసం తగ్గించుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. ఈ…

34 minutes ago

బ్రహ్మ ముహూర్తం అలవాటు పెంచుకుంటే మీలో ఈ మార్పులు ఖాయం!

మన జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పులకు దారి తీస్తాయి. అలాంటి వాటిలో ఉదయం వేళ లేవడం ఒక…

39 minutes ago

ఫేస్ ఇన్‌ఫ్లమేషన్ అలర్ట్: అందం తగ్గించే ముఖ వాపు… సులభంగా తగ్గించే చిట్కాలు ఇవే!

ముఖం ఎప్పుడూ ఫ్రెష్‌గా, కాంతివంతంగా కనిపించడం ప్రతి ఒక్కరికీ ఇష్టం. అయితే కొన్నిసార్లు కారణం తెలియకుండానే ముఖం ఉబ్బినట్లు, ఎర్రబడినట్లు…

45 minutes ago

భారత్ చింతపండు దుమ్మురేపుతోంది… ప్రపంచ మార్కెట్‌లో టాప్ ప్లేస్!

భారతీయ వంటింట్లో చింతపండు లేకుండా చాలా వంటలు పూర్తవవు. పులుపు రుచిని ఇచ్చే ఈ సహజ పదార్థం కేవలం రుచికే…

51 minutes ago