బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. తాజాగా ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంతో ఆ డేట్ ను వెల్లడించారు. అంతేకాదు.. ట్రైలర్ ను కూడా ఎప్పుడు విడుదల చేస్తారో కూడా తెలియజేశారు. అఖిల్ ఇంత వరకు నటించిన సినిమాల్లో ఒక్కటి కూడా బంపర్ హిట్ కొట్టలేదు. అన్నీ యావరేజ్ గానే ప్రేక్షకుల నుంచి టాక్ వినిపించింది.

ఎన్నో సార్లు ఈ సినిమా వాయిదా పడుతూ.. ఎన్నో కష్టాలను అధిగమిస్తూ.. ఇక్కడి వరకు వచ్చింది. కరోనా కారణంగా అంతకముందే ఎన్నో సార్లు విడుదల తేదీని ప్రకటించగా.. ఆ తేదీకి విడుదల చేయలేకపోయారు. దీంతో మరోసారి విడుదల తేదీని ప్రకటించారు. అదేంటంటే.. దీనిని దసరా కానుకగా.. అక్టోబర్ 15 దీనిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ట్రైలర్ ను రేపు సాయంత్రం 06.30 గంటలకు విడుదల చేస్తామని తెలిపారు. వాస్తవానికి మొదట ఈ సినిమాకు అక్టోబర్ 8 న విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ తేదీన వైష్టవ్ తేజ్ సినిమా ‘కొండపొలం’ విడుదల రానుంది. దీంతో ఈ సినిమా విడుదలను మరో వారం రోజులు ముందుకు జరిపారు. ఈ సినిమాను పండుగకు ముందు కాకుండా విజయదశమి రోజునే రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
దీనికి సంబంధించిన కొన్ని పోస్టర్స్‌ను కూడా చిత్రబృందం విడుదల చేసింది. దీనిలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అటు బొమ్మరిల్లు భాస్కర్ కు.. ఇటు అక్కినేని అఖిల్ కు ఎంతో కీలకం కానుంది. ఈ సినిమా కుటుంబకథా చిత్రంతో పాటు.. దీనిలో మంచి ఎంటర్ టైన్మెంట్ కూడా ఉందంటూ బొమ్మరిల్లు భాస్కర్ తెలిపారు.































