Movie News

భర్తను కిడ్నాప్ చేసి.. బలవంతంగా విడాకులు తీసుకుంది ఓ భార్య.. తర్వాత ఏమైందంటే..

వివాహేతర సంబంధాలు చివరకు ఎంత దూరం తీసుకొస్తున్నాయో ఈ వార్తను చదివితే అర్థం అవుతుంది. ఆమెకు వివాహం అయి కొన్ని సంవత్సరాలు అవుతుంది. కానీ ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఎలాగైనా అతడితో ఉండాలని నిర్ణయం తీసుకుంది. అనుకున్నట్లుగానే ఆమె మాస్టర్ ప్లాన్ వేసింది. భర్తను కిడ్నాప్ చేసి.. అతడితో వెళ్లి పోయింది. చివరకు పోలీసులకు ఈ విషయం తెలవడంతో అతడికి కాపాడి.. ఆమెతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు.

ఈ ఘటన హైదరాబాద్ లోని మౌలాలీ ఆర్టీసీ కాలనీలో చోటుచేసుకుది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మౌలాలీ ఆర్టీసీ కాలనీకి చెందిన షేక్‌వాజీద్‌ (31), ఆప్షియా బేగం(24)లకు 2012లో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడు బస్టాండ్ ఏరియాలోని ఓ చెప్పుల షాప్ లో పనిచేస్తాడు. అతడి భార్య మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అందులో భాగంగానే ముషీరాబాద్ చెందిన క్యాటరింగ్ పనులు చేసే ఆసిఫ్ ఆమెకు పరిచయం అయ్యాడు.

వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కుదిరింది. అతడికి కూడా వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమె అతడి మోజులో పడిపోయింది. ఓ రోజు అతడి కోసం ఇంటి నుంచి వెళ్లిపోయింది. అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాళ్లు ఆమె ఆచూకీ తెలుసుకొని భర్తకు అప్పగించారు. మరో సారి కూడా ఇలానే జరగడంతో మళ్లీ భర్తకు అప్పగించారు. తనకు తన భర్తతో ఉండటం ఇష్టం లేదని.. తనకు విడాకులు కావాలని ఆమె కోరింది. కాని అతడు దానికి ఒప్పుకోలేదు.

దీంతో ఆమె .. భర్తను కిడ్నాప్ చేసి.. ప్రియుడితో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రియుడితో పాటు .. పార్సిగుట్టకు చెందిన ఇమ్రాన్‌ మహ్మద్‌, ఎండి జాఫర్‌, ఇర్ఫాన్‌ అహ్మద్‌, మహమూద్‌లను ఇందుకు రెడీ చేసి.. షాప్ లో ఉన్న అతడిని బలవంతంగా రెండు బైక్ లపై ముషీరాబాద్ తీసుకెళ్లి మత పెద్దల సమక్షంలో విడాకులు విప్పించుకున్నారు. పోలీసులకు విషయం తెలవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.. మరికొందరు పరారీలో ఉన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago