Pushpa Movie: అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ విడుదల అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే షూటింగ్ పనులను ప్రారంభం చేయాల్సిన ఈ సినిమా మరికాస్త ఆలస్యం అవుతూ వస్తోంది.
ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ తల్లి పాత్రలో నటించిన నటి గురించి అందరికీ సుపరిచితమే ఈమె పలు సీరియల్స్ లోనూ అలాగే పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ సందడి చేశారు. ఇలా అల్లు అర్జున్ తల్లి పాత్రలో నటించిన ఈమె పేరు కల్పలత. పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని తనకు పుష్ప సినిమాలో నటించే అవకాశం ఎలా వచ్చిందో తెలియజేశారు.
ఈ సందర్భంగా పుష్ప సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి తాను కూడా ఆడిషన్స్ లో పాల్గొన్నానని తెలిపారు. ఈ సినిమాలో మొత్తం చిత్తూరు స్లాంగ్ మాట్లాడాలి.తనకు రాకపోయినా ఎంతో కష్టపడి చిత్తూరు యాసలో మాట్లాడానని కల్పలత తెలిపారు. ఇలా ఆడిషన్స్ అయిపోయిన తర్వాత చాలా రోజుల వరకు తనకు ఫోన్ కాల్ రాలేదని వెల్లడించారు.
ఇలా ఫోన్ కాల్ రాకపోవడంతో తను కూడా సినిమాపై ఆశలు వదులుకున్నానని అయితే ఆడిషన్స్ జరిగిన ఆరు నెలలకు తనకు ఈ సినిమాలో సెలెక్ట్ అయినట్లు ఫోన్ కాల్ వచ్చిందని,అలా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కు తల్లి పాత్రలో నటించే అవకాశం వచ్చిందని ఈమె తెలిపారు. ఇక కొడుకులు లేని తనకు అల్లు అర్జున్ కొడుకు పాత్రలో నటించడంతో ఆ కోరిక కూడా తీరిపోయిందని ఈ సందర్భంగా కల్పలత పుష్ప సినిమాలో తన పాత్ర గురించి వెల్లడించారు.
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఉదయాన్నే చల్లని గాలులు తాకుతుండగా, మధ్యాహ్నానికి…
ఉద్యోగులు ప్రతీ నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్‌గా కట్ అవుతుందని తెలుసు. కానీ ఆ డబ్బు నిజంగా…
ఇంటి ఖర్చుల్లో పెద్ద భాగం బియ్యం, పప్పులపైనే ఉంటుంది. చాలా కుటుంబాలు నెలలకు, కొందరు ఏడాదికే సరిపడా సరుకును ఒకేసారి…
మెగాస్టార్ చిరంజీవికి భుజం సర్జరీ ఆందోళన వద్దు.. కోలుకుంటున్నానని స్వయంగా వెల్లడించిన స్టార్ హీరో సోషల్ మీడియాలో ఇటీవల ఒక…
రేచర్ల రాజుల కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్లు వెలుగులోకి తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం పొందిన రాచకొండ మరోసారి వార్తల్లో…