Categories: FeaturedMovie News

Radha Manohar Das : రామ్ చరణ్ కూతురు జాతకం చెప్పిన వేణుస్వామి మీద ఫైర్ అయిన రాధా మనోహర్ దాస్…!

Radha Manohar Das : మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, మెగా కోడలు ఉపాసనకు జూన్ 20 న కూతురు పుట్టింది. పాప పుట్టగానే అటు మెగా ఫ్యామిలీ లోనూ ఇటు మెగా అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అప్పటినుండి సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. మంగళవారం నాడు మా ఇంటికి లక్ష్మి దేవి వచ్చిందంటూ చిరంజీవి గారు మానవరాలి గురించి చెబుతూ ఆనందపడిపోయారు. అయితే ఇపుడున్న సోషల్ మీడియా ఎవరినీ వదలదు. ఇన్నిరోజులు మెగా ఇంట్లో వారసులు రాలేదని రామ్ చరణ్, ఉపాసన లను ట్రోల్ చేసారు. ఇక ఉపాసన ప్రెగ్నెంట్ అయ్యాక ఆమె గర్భవతి అయినా కడుపు కనిపించడం లేదు అంటూ సరోగసీ అంటూ ఏవేవో మాట్లాడారు. తాజాగా పుట్టిన పసిపాపను కూడా వదలడం లేదు. ఒక్క రోజు పాపకు జాతకం అంటూ మెగా వంశాన్ని పాప జాతకం ఎలా మార్చాబోతోంది అంటూ హడావిడి చేస్తున్నారు. తాజాగా సెలబ్రిటీల ఆస్ట్రాలజర్ గా చెప్పుకునే వేణుస్వామి మెగా వారసురాలి జాతకం చెప్పారు. అయితే ఈ ఇష్యూ గురించి మరో ఆస్ట్రాలజర్ రాధా మనోహర్ దాస్ మాట్లాడారు.

చిన్న పాపకు జాతకం చూడటం ఏమిటి…

పాప పుట్టి ఒకరోజైనా కాలేదు అపుడే పాప జాతకం చూడటం ఏంటి అంటూ ఫైర్ అయ్యారు రాధా మనోహర్ దాస్. రామ్ చరణ్ ఒక శివాలయంలో ఎపుడూ పూజ చేస్తుంటారు. అందువల్లే వాళ్ళింట్లో అమ్మవారు పుట్టిందని భావిస్తున్నాను అంటూ చెప్పారు. వేణుస్వామి వంటి వారు సోషల్ మీడియాలో వ్యూస్ కోసం పబ్లిసిటీ కోసం పసిపాపను కూడా వదలడం లేదు.

పాపకు 12 ఏళ్ళు వచ్చే వరకు ఎలాంటి జాతకం చూడకూడదు అంటూ చెప్పారు. పసిపిల్లలు జాతకాలను చూడరు. వారి తల్లిదండ్రుల కుటుంబం సభ్యుల అనుమతి లేకుండానే సెలబ్రిటీల పిల్లలు కావడం వల్ల జాతకాలను సోషల్ మీడియాలో చెప్పేస్తున్నారు, అది తప్పు అంటూ రాధా మనోహర్ దాస్ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago