Radhika Apte: సౌత్, నార్త్ సినిమాలలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి గుర్తింపు పొందిన నటి రాధిక ఆప్టే గురించి తెలియని వారంటూ ఉండదు. సౌత్, నార్త్ లో మాత్రమే కాకుండా అటు హాలీవుడ్ లో కూడా తనదైన సత్తా చాటుకుంటున్న ఈ అమ్మడు తెలుగులో కూడా రక్త చరిత్ర, ధోనీ, లెజెండ్, వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయింది.
ఏ విషయం గురించి అయినా తాను అనుకున్నది అనుకున్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఉన్న రాధిక ఆప్టే ప్రస్తుతం ఆడ మగ మద్య వ్యత్యాసం గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధిక ఆప్టే ఆడ,మగ మధ్య సమానత్వం గురించి మాట్లాడుతూ…
” మహిళలు మగవారితో సమానంగా సంపాదిస్తున్నారు . అయినప్పటికీ ఇంటికి రాగానే ఇంటి భాధ్యత మొత్తం మహిళలే ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించింది. ప్రస్తుతం మగవారితో సమానంగా మహిళలు కూడా సంపాదిస్తున్నారు. అయితే ఆడవారు ఇంటికి రాగానే ఇంటి బాధ్యతతో పాటు కుటుంబ సభ్యుల బాధ్యత తీసుకోమనటం ఇది ఎక్కడి సమానత్వం అంటూ ప్రశ్నించింది.
ఆడవారే ఇలా ఇంటి బాధ్యతలు చేపట్టాలని చిన్నప్పటినుండి అలవాటు చేస్తున్నారు. అయితే కుటుంబం కోసం మహిళలకు ఎంత బాధ్యత ఉందో పురుషులకు కూడా అంతే ఉంది. కుటుంబం కోసం మహిళలు అంత త్యాగం చేయాల్సిన అవసరం లేదు. కుటుంబ సభ్యులందరూ తలా ఒక పని చేస్తే సరిపోతుంది అంటూ సమాజంలో స్త్రీ, పురుషుల సమానత్వం గురించి రాధిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…