Featured

Raghu Kunche : రవితేజను ఒక్క ఛాన్స్ ఇవ్వమని చాలా సార్లు అడిగాను…ఇప్పటి వరకు ఇవ్వలేదు… అందరికి మనం నచ్చాలని లేదు కదా…: సింగర్ రఘు కుంచె

Raghu Kunche : యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సీరియల్ నటుడుగా ఇక సింగర్ గా వెయ్యికి పైగా పాటలు పాడిన సింగర్ రఘు కుంచె. ఈ మధ్య కాలంలో విలన్ పాత్రలను సినిమాల్లో చేస్తూ మెప్పిస్తున్నారు. ఇక రఘు కుంచె మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా పలు సినిమాలకు మ్యూజిక్ అందించి మెప్పించారు. ఇక తనతో పాటు సినిమాల్లో అవకాశాల కోసం వచ్చిన వారిలో రవితేజ, పూరీ జగన్నాథ్ వంటి వారు ఉన్నారు. అప్పటి వారి మధ్య జరిగిన జ్ఞాపకాలను పంచుకున్నారు రఘు కుంచె.

రవితేజ ను చాలా సార్లు అడిగినా లాభం లేదు…

రవితేజ ఎంతో కష్టపడి పైకి వచ్చిన నటుడు. అలా స్ట్రగల్ అవుతున్న రోజుల్లోనే రఘు కుంచె కి రవితేజ మంచి మిత్రుడు. అప్పటికే డబ్బింగ్స్ చెబుతూ సాంగ్స్ పడుతూ కొంత పేరు తెచ్చుకున్న రఘు కుంచె రవితేజ హీరో అయ్యాక చాలా సార్లు రవితేజను ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగాడట. ఇప్పటికి చాలా సార్లు అడిగినా ఎందుకో రవితేజ సినిమాలో అవకాశం రాలేదని చెప్పారు రఘు. ఇక పూరీ జగన్నాథ్ ను అలా అడగలేనని ఇప్పటికీ తాను నాకు ఎంతో చేసాడని ఇంకా అడగటం కరెక్ట్ కాదంటూ రఘు కుంచె తెలిపారు.

తన సినిమాల్లో కొన్నింటికి అవకాశం ఇచ్చాడని తెలిపారు. ఇక చాలా సినిమాల్లో మొదటి సారి నన్ను తీసుకున్నా అవి మ్యూజికల్ గా హిట్ అయిన కూడా మళ్ళీ సినిమాకు నన్ను రిపీట్ చేయరు అది ఎందుకో తెలియదు. అందరికి మనం నచ్చాలని లేదు కదా అని నాకు నేను సర్ది చెప్పుకుంటా అంటూ రఘు కుంచె ఆయన కెరీర్ గురించిన విషయాలను తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago