Featured

Naveen Murder Case : నవీన్ ను చంపితేనే మన పెళ్లి… నిజం ఒప్పుకున్నా నిహారిక రెడ్డి…!

Naveen Murder Case : స్నేహితుడు పిలిచాడని పార్టీ కి వెళితే నమ్మించి గొంతు నులిమి చంపేశాడు ఫ్రెండ్.ఇక చంపమని చెప్పిందేమో మాజీ ప్రియురాలు. ఒళ్ళు గగూర్పొడిచేలా హత్య చేసి సాక్ష్యాలు దొరకకుండా శవాన్ని కాల్చేసి మళ్ళీ పోలీసులకు లొంగిపోయాడు నిందితుడు. ఇదంతా హైదరాబాద్ నగరం అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన బి టెక్ విద్యార్థి నవీన్ హత్య చరిత్ర. ఇంటర్ లో కలిసి చదువుకున్న నవీన్ ఫ్రెండ్ హరిహర కృష్ణ నే నవీన్ ను పార్టీ చేసుకుందాం రమ్మని పిలిచి దారుణంగా చంపాడు. ఇక ఇదంతా చేసింది కేవలం ఒక అమ్మాయి కోసమనే విషయమే అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఈ కేసులో హరిహర కృష్ణ లొంగిపోయి నేనే చేశాను అని చెబుతున్న ఇందులో నిహారిక రెడ్డి అనే యువతి అలాగే మరో కొందరి ప్రమేయం ఉంది అంటూ హత్యకు గురైన నవీన్ కుటుంబ సభ్యులు మొదటి నుండి ఆరోపిస్తున్నారు. చివరకు నిహారిక రెడ్డిని అలాగే హరిహర స్నేహితుడు హాసన్ ను కూడా పోలీసులు అరెస్టు చేయగా ఎట్టకేలకు నిహారిక నోరు విప్పింది.

నవీన్ హత్య తరువాత పెళ్లి చేసుకుందామని అనుకున్నాం….

మొదటి నుండి కేసులో కీలక వ్యక్తిగా వున్న నిహారిక రెడ్డి పోలీసుల విచారణలో నోరువిప్పలేదు. ఎక్కువగా ప్రశ్నిస్తే ఆత్మహత్య చేసుకుంటా అంటూ బెదిరించింది. చివరకు ఆమెను పోలీసులు ట్రాప్ చేసి అరెస్టు చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిహారిక ఒక్కొక్కటిగా విషయాన్ని వివరిస్తోంది.

హరిహర చేసిన హత్య అసలు తనకు తెలియదంటూ మొదట బుకాయించిన నిహారిక ఇప్పుడు నవీన్ ను చంపిన తరువాత హరిహర ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు వెల్లడించింది. అటు హరిహర కూడా నవీన్ నిహారికను వేదించాడని అందుకే చంపానంటూ హత్య అనంతరం ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు పోలీసులకు చెప్పడం గమనార్హం. మొత్తానికి ఈ కేసులో ఒక్కోముడి ఆలస్యంగా అయిన వీడుతున్నాయి. హత్య కు గురైన నవీన్ కుటుంబానికి న్యాయం జరిగే దిశగా అడుగులు పడుతున్నాయి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago