Movie News

Rashi Khanna: బాహుబలి సినిమాలో అంత మంచి పాత్రను మిస్ చేసుకున్న రాశి ఖన్నా… నిజంగానే బ్యాడ్ లక్!

Rashi Khanna: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం బాహుబలి సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే.ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు పాన్ ఇండియా సెలబ్రిటీలుగా పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.

మొదటి భాగంలో అవంతిక పాత్రలో తమన్నా ఎంతో అద్భుతంగా నటించగా తమన్నా ప్రభాస్ మధ్య మొదటి పార్ట్ ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ అవంతిక పాత్రలో తమన్నా నటించి సందడి చేశారు. అయితే అవంతిక పాత్ర కోసం తాను కూడా ఆడిషన్ కి వెళ్ళాను అంటూ తాజాగా నటి రాశిఖన్నా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రస్తుతం బాలీవుడ్ సినిమాతో ఎంతో బిజీగా ఉన్నటువంటి రాశికన్నా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఆడిషన్స్ జరుగుతుండగా తనని కూడా అవంతిక పాత్ర కోసం ఆడిషన్ కి పిలిచారని తెలిపారు. అయితే తనని చూసినటువంటి రాజమౌళి చాలా ముద్దుగా ఉన్నానని తాను ఏదైనా ప్రేమ కథ సినిమాలకు సూట్ అవుతానని చెప్పినట్లు రాశికన్నా వెల్లడించారు.

Rashi Khanna: ఎప్పటికైనా ఆయన సినిమాలో నటించాలని ఉంది…

తన స్నేహితుడు ఓ కథ సిద్ధం చేశారని తనని సంప్రదించమని ఈమెకు రాజమౌళి సలహా ఇచ్చారట అలా రాజమౌళి గారి సలహాతో తనకు ఊహలు గుసగుసలాడే సినిమా అవకాశం వచ్చిందని,అయితే రాజమౌళి దర్శకత్వంలో అవంతిక పాత్ర మిస్ అయినందుకు బాధగా కూడా ఉందని తెలిపారు. కానీ ఎప్పటికైనా రాజమౌళి గారి సినిమాలో ఒక చిన్న పాత్రలో అయినా నటించడమే తన కోరిక అంటూ ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago