రఘువరన్… దక్షిణ సినీ ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేని నటుడు ఆయన. దాదాపు 150 సినిమాలు తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం చిత్రాలలో ఆయన నటించారు. రఘువరన్ డిసెంబర్ 11 1948 సంవత్సరంలో కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాలో కొలెంగుడే ప్రాంతం నందు జన్మించారు. ఈయన కుటుంబ విషయానికి విషయానికొస్తే ఆయన తల్లిదండ్రుల పేర్లు వేలాయుధన్, కస్తూరి. ఇక ఈయన సినిమాలలో కొనసాగుతుండగానే తెలుగు నటి రోహిణిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ పుట్టిన కొడుకు పేరు రిషివరన్. అయితే వీరిద్దరూ కొన్ని మనస్పర్థలతో విడాకులు కూడా తీసుకున్నారు.
ఇక ఈయన గురించి ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే… రఘువరన్ ” కొండ పి డుగు ” అనే తెలుగు సినిమాలో మొదటగా నటించాడు. నిజానికి ఆ సినిమాలో రఘువరన్ నటించినట్లు కూడా ఎవరు గుర్తు పట్టారు. రఘువరన్ కి ఏకంగా 13 భాషల్లో సినిమాలను చేశాడు. సినిమాలు చేయడమే కాకుండా ఆ భాషలో మాట్లాడగలిగే సత్తా అయినది. నిజానికి ఆయనకు కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఆసక్తి.
అయితే ఆయన ఒకానొక సమయంలో తెలుగులో విలనిజం అంటే రఘువరన్ కేరాఫ్ అడ్రస్ గా మారాడు. అంతేకాకుండా కొన్నిసార్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన పాత్రలు పోషించారు. రఘువరన్ నటించిన శివ, పసివాడి ప్రాణం, భాషా మొదలైన సినిమాల్లో ఆయనకు తెలుగులో మంచి పేరు తీసుకొచ్చాయి. ఇకపోతే జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. తనకు సినిమా అవకాశాలు తగ్గిన నేపథ్యంలో ఆయన కాస్త మద్యానికి బానిస అవ్వడం జరిగింది. దీనిపై ఆయన జీవితం పూర్తిగా ఒడిదుడుకులకు లోనయింది. చివరికి రఘువరన్ మార్చి 19, 2008 న చెన్నైలో తన నివాసంలో రాత్రి పడుకున్నప్పుడు గుండెపోటుతో కన్నుమూసారు.. ఎక్కువ రోజులు మద్యం తాగడం వల్ల ఆయనకు కాలం కూడా దెబ్బతిన్నది. తనకు ఇక ఎక్కువ కాలం జీవించను అని ముందే తెలిసిన రఘువరన్ తనకు కావాల్సిన వాళ్లవాళ్లను స్నేహితులను పిలిచి అందరికి పార్టీ ఇచ్చాడు. చివరికి ఆయన చావు జరిగే కొద్ది రోజుల ముందు ఆయన నిద్రలో ఉండగా కన్నుమూసిన సన్నివేశం లాగానే నిజజీవితంలో కూడా ఆయన అలాగే తనువు చాలించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…