Categories: FeaturedMovie News

నాది తెలంగాణ ఆని చెప్పే విజయశాంతి అసలు ఆమె పుట్టిన ఊరు ఎక్కడో తెలుసా ?

విజయశాంతి… తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక సినిమాలు చేసి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఈవిడ. ఈవిడ జూన్ 24, 1966 సంవత్సరంలో తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో జన్మించారు. ఈమె తల్లిదండ్రుల పేర్లు సత్తి శ్రీనివాస్ ప్రసాద్, సత్తి వరలక్ష్మి. ఈమెకు టాలీవుడ్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ పిలవబడతారు. నటి విజయశాంతి ఇప్పటివరకు తన తెలుగు, తమిళ సినీ నటి జీవితంలో… 30 సంవత్సరాల ఇండస్ట్రీ కాలంలో ఆవిడ ఏకంగా వివిధ పాత్రలను 180 సినిమాలకు పైగా నటించారు. అంతేకాదు ఆమెకు 1991 సంవత్సరం లో కర్తవ్యం సినిమాలో జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. అంతేకాకుండా ఆమె ఏకంగా ఏడుసార్లు దక్షిణాది ఫిలింఫేర్ , ఆరు సార్లు ఉత్తమ నటిగా, అలాగే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డు నాలుగు సార్లు, దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్ మెంట్ 2003వ సంవత్సరంలో అందుకున్నారు.

ఇక ఈమె నటన జీవితానికి కారణం అప్పటి హీరోయిన్ విజయలలిత. నిజానికి విజయశాంతి ఏడు 7 ఏళ్ల ప్రాయంలోనే బాలనటిగా సినీ రంగంలోకి ప్రవేశించింది అని చెబుతారు. కానీ ఆమె ఏ చిత్రాల్లో నటించింది అన్న విషయాలు సరిగ్గా లేవు. ఇకపోతే విజయలలిత తన హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో విజయశాంతిని, ఆమె తల్లిని, ఆమె పిన్ని శ్రీ శాంతిని చెన్నైలోని టీ నగర్ లో విజయలలిత ఇంట్లో నివాసం ఉండేవారు. అయితే విజయశాంతి 1979వ సంవత్సరంలో తమిళ సినిమా కల్లుక్కుళ్ ఈరమ్ అనే సినిమా ద్వారా భారతీరాజా దర్శకత్వంలో ఈవిడ తన మొదటి సినిమాను చేశారు. ఇక అలా ప్రస్థానం కొనసాగుతూ వెళ్ళింది. అయితే విజయశాంతి తన నటనా జీవితంలో మొదట్లో కేవలం ఒక డాన్సర్ గా మాత్రమే సినిమాకు పరిచయం అయింది. అదికూడా సోలో డ్యాన్సర్గా పరిచయమై అనేక సినిమాల్లో కేవలం డాన్స్, చిన్నచిన్న డైలాగులు తోనే నెట్టుకొచ్చింది.

అనేక సినిమాల్లో నటించిన చివరికి తన నటన చూపించే తగ్గ సినిమాలు రాకపోవడం నిజంగా ఆమెకు ఒకనొక సమయంలో బాధ వేసింది. ఇకపోతే అప్పట్లో టీ. కృష్ణ దర్శకుడు ఉండేవారు. ఆయన తీసిన ఏడు సినిమాల్లో కేవలం విజయశాంతి మాత్రమే హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. ఇక దీనితో ఆ సినిమాల్లో విజయశాంతి తనలోని నటన చూపించే విధంగా పాత్రలు చేసింది. ఇక అంతే అప్పటి నుంచి విజయశాంతి స్టార్డం మారిపోయింది. ఆ తర్వాత తను విజయలలిత దగ్గర నుంచి బయటకు వచ్చి తన తల్లితో వేరొక చోట ఇల్లు తీసుకుని అక్కడ జీవనం కొనసాగించారు.

అయితే తనలోని నటనను బయటికి చూపించిన టి.కృష్ణ క్యాన్సర్ మూలంగా చనిపోవడంతో విజయశాంతి రెండు రోజులు అసలు అపస్మారక స్థితిలో లేకపోవడం నిజంగా ఆవిడను అంతలా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోయింది. విజయశాంతి కి తనకు జీవితంలో సహాయం చేసిన వారిని, గొప్ప స్థాయికి చేరిన వారిని ఆమె ఎప్పుడూ మర్చిపోకుండా సదరు మర్యాద చూపుతుంది. విజయశాంతి ఈ సంవత్సరం రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా ప్రధాన పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందే.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago