Rahul Gandhi : పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు లొంగిపోయారని ఆయన దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన పార్టీ సమావేశంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ ఫోన్ చేసి మోదీని బెదిరించారా?
ఆపరేషన్ సిందూర్ మొదలైన వెంటనే ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. “మోదీజీ.. ఏం చేస్తున్నారు అని ట్రంప్ ఫోన్‌లో అడిగారు. ‘నరేందర్.. సరెండర్’ అనగానే మోదీ కాల్పుల విరమణ ప్రకటించారు. ట్రంప్ ఆదేశాలను మోదీ తూచా తప్పకుండా పాటించారు” అని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.
కాంగ్రెస్ ధైర్యానికి నిదర్శనం 1971 యుద్ధం
కాంగ్రెస్ పార్టీ గతంలో అగ్రరాజ్యాలను ధైర్యంగా ఎదుర్కొన్నదని రాహుల్ గుర్తు చేశారు. “అమెరికా బెదిరింపులను కూడా లెక్కచేయకుండా ఇందిరా గాంధీ హయాంలో 1971లో పాకిస్థాన్‌ను భారత్ విచ్ఛిన్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడింది, ఎప్పటికీ తలవంచదు. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి మహనీయులంతా అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధులే” అని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ ఎవరికీ తలవంచదని ఆయన స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏమిటి? దిగువ కామెంట్స్ లో తెలియజేయండి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…