Rahul sipliganj parents : రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి ఎప్పుడంటే… ఆ సినిమా తరువాత ఒప్పుకోకపోయినా చేసేస్తాం…: రాహుల్ పేరెంట్స్

Rahul Sipliganj : తెలంగాణ హైదరాబాద్ కు చెందిన రాహుల్ సిప్లిగంజ్ తన యూట్యూబ్ ఛానెల్ లో సొంతంగా ఆల్బమ్స్ చేసి పెడుతూ పేరు తెచ్చుకున్నాడు. అలా మగజాతి, మంగమ్మ, మైసమ్మ వంటి ఆల్బమ్స్ తో ఫేమస్ అయిన రాహుల్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘జోష్’ సినిమాలో మొదటిసారిగా పాట పాడిన రాహుల్ ఆ తరువాత ‘దమ్ము’ సినిమాలో వాస్తు బాగుందే పాటతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత వరుసగా సినిమాల్లో పాటలు పాడిన రాహుల్ కి తెలుగు ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు వచ్చిన పాట ‘రంగస్థలం’ సినిమాలో పడిన రంగ రంగ రంగస్థలాన పాట. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో సింగర్ కాలభైరవ తో కలిసి పాడిన నాటు నాటు పాటకు అంతర్జాతీయంగా గుర్తింపుతో పాటు ఏకంగా మొదటిసారిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును ఒక భారతీయ గీతానికి తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు ఏకంగా ఆస్కార్ అవార్డు రావడంతో కెరీర్ లో మంచి సక్సెస్ చూస్తున్న రాహుల్ సిప్లిగంజ్ గురించి పేరెంట్స్ గర్వపడుతున్నారు.

రాహుల్ పెళ్లి ఎప్పుడంటే…

రాహుల్ టాలెంట్ ను చిన్నతనంలోనే గుర్తించిన రాహుల్ పేరెంట్స్ అతడికి మ్యూజిక్ నేర్పించారు. దరువేస్తూ పాటలు పాడటం చిన్నతనంలో అలవాటు చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్ కి అలవాటు ఉందంటూ చెప్పిన ఆయన తల్లిదండ్రులు కొడుకు సాధిస్తున్న విజయాలను చూస్తుంటే గర్వంగా ఉందంటూ సంబర పడిపోతున్నారు.

ఇక తాను పాడిన నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు రావడంతో ఆనందానికి హద్దులు లేవంటూ చెప్పారు. అవార్డు ప్రకటించే రోజు రాత్రంతా నిద్రపోలేదంటూ చెప్పారు. ఇక రాహుల్ ప్రస్తుతం కృష్ణ వంశీ డైరెక్సషన్ లో ‘రంగ మార్తాండ’ సినిమాలో నటిస్తుండగా ఆ సినిమా తరువాత పెళ్లి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.