సాధారణంగా మనం నిత్యం ఎన్నో రకాల పాములను చూసి, వాటి గురించి వినే ఉంటాం. కొన్ని రకాల పాములు ఎంతో విషపూరితమైనవి, మరికొన్ని పెద్దగా విషాన్ని కలిగి ఉండవు. అయితే ఒక్కో జాతికి చెందిన పాములు ఒక్కో విధమైన రంగును పోలి ఉంటాయి. ఈ క్రమంలోనే రకరకాల పాములను మనం చూసే ఉంటాము. కానీ మీరు ఎప్పుడైనా ఇంద్రధనస్సు రంగును పోలి ఉన్నటువంటి పాముని చూశారా… ఏంటి పాము ఇంద్రధనుసు రంగులలో ఉండటమా అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..
కాలిఫోర్నియాలో పాముల కోసం ప్రత్యేకంగా సరీసృపాల జూ ఏర్పాటు చేసిన జయ్ బ్రెవర్ మరోసారి వివిధ రంగుల కలిగినటువంటి ఓ అరుదైన పాముతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ పాము పై సూర్యరశ్మి పడగానే అది ఇంద్రధనస్సులో ఉన్నటువంటి రంగులతో ఎంతో కాంతివంతంగా మెరుస్తూ కనబడుతోంది. అందుకే ఈ పామును రెయిన్ బో స్నేక్ అని పిలుస్తారు.
ఈ విధంగా మెరిసిపోయే పామును చూస్తే తప్పకుండా అది ఒక ప్లాస్టిక్ పామని భావించి మానరు. ఈ క్రమంలోనే ఈ వీడియోలో జయ్ రెయిన్ బో స్నేకును బాక్సులో పెట్టడాన్ని చూడవచ్చు. ఈ విధమైనటువంటి రెయిన్‌బో పాములు కొండ జాతికి చెందిన వాటిలో ఒక రకానికి చెందినవని , ఈ రకానికి చెందిన పాములు అంత విషపూరితమైనవి కావని ఈ సందర్భంగా జయ్ తెలిపారు.
https://www.instagram.com/reel/CP3ErGBlh95/?utm_source=ig_web_copy_link
ఈ విధంగా రంగులు కలిగినటువంటి రెయిన్ బో పాము శాస్త్రీయ నామం “ఫరాన్సియా ఎరిత్రోగామ” అని వివరించాడు. ప్రస్తుతం పాములకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది. మరెందుకు ఆలస్యం ఎంతో విభిన్నంగా ఉండే ఈ పాముల వీడియో పై మీరు ఓ లుక్కేయండి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…