Featured

నవ్వుల రారాజు రాజాబాబు కొడుకులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో.. ఏలా ఉన్నారో తెలుసా ?

రాజబాబు, రేలంగి… ఈ ఇద్దరి కమెడియన్ల పేర్లను తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపో లేరని చెప్పుకోవచ్చు. అప్పట్లో రాజబాబు హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే అతని హాస్యనటనకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. 1937 అక్టోబర్ 20 తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో మా మహేశ్వర రావు రమణమ్మ దంపతులకు జన్మించిన రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు.

ఇతనికి తమ్ముల్లుగా జన్మించిన చిట్టిబాబు, అనంత్ బాబు కూడా తెలుగు పరిశ్రమలో హాస్యనటులుగా కొనసాగారు. ఆనాటి కాలంలోనే రాజబాబు ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం పూర్తి చేసి టీచర్ ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేసి తెలుగు ఉపాధ్యాయుడిగా కొన్ని రోజుల పాటు పనిచేశారు. అయితే ఆ సమయంలోనే నాటకాలలో నటించడం ప్రారంభించారు రాజబాబు. కుక్కపిల్ల దొరికింది నాలుగిళ్ళ చావిడి అల్లూరి సీతారామరాజు వంటి నాటకాలలో వేషాలు వేసిన రాజబాబుకి చాలా గొప్ప పేరు లభించింది. దాంతో సినిమాలో కూడా ప్రయత్నం చేసి సినీ నటుడిగా రాణించాలనుకున్నారు రాజబాబు.

ఆ సమయంలోనే గరికపాటి రాజారావు అతని నటనా నైపుణ్యం చూసి మద్రాసు రావాల్సిందిగా ఆహ్వానించారు. దీంతో బాగా సంబరపడిపోయిన రాజబాబు మద్రాసు వెళ్లారు కానీ సినీ అవకాశాలు అతను వెళ్ళిన వెంటనే లభించ లేదు. దీంతో చాలా కాలము ట్యూషన్లు చెబుతూ కొద్దిపాటి డబ్బు సంపాదించి జీవనం సాగించేవారు. ఆ క్రమంలోనే సినిమా దర్శకుడు అడ్డాల నారాయణరావు రాజబాబుకు సమాజం అనే సినిమాలో ఒక చిన్న పాత్ర ఇచ్చారు. ఈ సినిమా 1960 వ సంవత్సరంలో విడుదలై రాజబాబు బాగానే గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత దాదాపు 20 సంవత్సరాల పాటు టాలీవుడ్ పరిశ్రమలో హీరోగా హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.

కేవలం రెండు దశాబ్దాల్లో 589 సినిమాల్లో నటించారంటే అతను ఎంత బిజీగా ఉండేవారు అర్థం చేసుకోవచ్చు. తాతా మనోడు, పిచ్చోడు పెళ్లి, తిరుపతి, ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు వంటి సినిమాల్లో హీరోగా నటించాడు రాజబాబు. సినిమాల్లో అతనికి భార్యలు గా లీలారాణి, ప్రసన్న రాణి, గీతాంజలి రమాప్రభ నటించేవారు. అయితే ఎక్కువగా రమాప్రభ అతను కలిసి నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో వీళ్లిద్దరి కామెడీ జంటకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే అప్పట్లో రాజబాబు ఒక్క సినిమాల్లో నటించాలంటే లక్ష రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే వారట. ఈ విధంగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ కోటీశ్వరుడు అయ్యారట. అయితే రాజ బాబు 1965 వ సంవత్సరంలో రచయిత శ్రీశ్రీ మేనమామ కూతురైన లక్ష్మీ అమ్మలు ను పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ నాగేంద్ర బాబు, మహేష్ బాబు అనే ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. రాజబాబు చివరి దశలో ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వారు. ఈ మద్యపాన వ్యసనం కారణంగానే అతను క్యాన్సర్ బారిన పడి కేవలం 45 సంవత్సరాలకే మృత్యువాతపడ్డారు.

Rajababu Brothers

దీంతో తండ్రి లేని తన కుమారులను పెద్ద చదువులు చదివించారు లక్ష్మీ అమ్మలు. అలాగే రాజబాబుకి తమ్ముళ్లు అయిన చిట్టిబాబు, అనంత్ బాబు లను కూడా సొంత కుమారుల గా భావించి వారికి అన్ని చేసి పెట్టేవారు లక్ష్మి అమ్మలు. నాగేంద్రబాబు, మహేష్ బాబు బాగా చదువుకొని అమెరికా దేశంలో ఉద్యోగాలు సంపాదించి అక్కడే స్థిరపడిపోయారు. స్మార్ట్ ఫోన్, కార్లు, బస్సులలో అమర్చే జిపిఎస్ సిస్టమ్ రూపొందించడంలో రాజబాబు కుమారులైన నాగేంద్రబాబు, మహేష్ బాబు కీలకమైన పాత్ర వహించారట. అలాగే అమెరికాలో తమకంటూ రూ. 10 కోట్ల విలువైన ఒక విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారట. వాళ్లకి మన భారతదేశంలో కూడా దాదాపు 25 కోట్ల రూపాయలు ఉన్నాయని రాజబాబు తమ్ముడు అయిన చిట్టిబాబు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు..

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago