Raj Kumar : సినిమాల్లో రిస్క్ ఉన్న షాట్స్ చేయాలన్నపుడు, అనారోగ్య కారణాలతో షూటింగులకు రాలేనపుడు, కొండలను ఎక్కాలి అంటూ కొన్ని కష్టమైన షాట్స్ లో హీరోలకు బదులుగా డూపులను పెట్టి డైరెక్టర్స్ షూటింగ్ చేస్తారు. అలా అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా అందరికీ డూప్ లాగా చేసినా సినిమా ల్లో నేరుగా హీరో అవకాశాలు లేక బుల్లితెరకు పరిమితమైన నటుడు రాజ్ కుమార్. అచ్చం చిరంజీవి లాగా ఉండే రాజ్ కుమార్ ఆహార్యం, మొహం అన్నీ చిరులాగే ఉంటాయి. దూరం నుండి రాజ్ కుమార్ ను చూస్తే చిరు అనే అనుకోవచ్చు. రాజ్ కుమార్ కర్ణాటకకు చెందిన వారైనా చిరంజీవి లాగా ఉండటం వల్ల ఆంధ్రాలో బాగా ఫేమస్ అయ్యారు.
హీరోగా సినిమా చేసి పేరు తెచ్చుకోవాలి…
రాజ్ కుమార్ ను తెలుగులో మొదట పరిచయం చేసింది దాసరి నారాయణ రావు గారు. అయన సినిమా ‘అమ్మ రాజీనామా’ లో ఒక ముఖ్యపాత్రలో రాజ్ కుమార్ నటించారు. అయినా రాజ్ కుమార్ ను తెలుగు ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోలేదు. ఇక కన్నడ లో మాత్రం హీరోగా సక్సెస్ చూసారు రాజ్ కుమార్. ఇక తెలుగులో సినిమాల్లో కంటే సీరియల్స్ తో బాగా పేరు తెచ్చుకున్నారు రాజ్ కుమార్. ఈటీవీలో విధి, జెమినీ లో పవిత్ర బంధం వంటి హిట్ సీరియల్స్ లో హీరోగా చేసారు.
దాదాపు 12 సంవత్సరాలు బ్రేక్ లేకుండా సీరియల్స్ చేసిన ఆయన తెలుగులో హీరోగా హిట్ కొట్టాలనే కోరికతో ఉన్నారు. ఇక ప్రస్తుతం ‘కేర్ ఆఫ్ అనసూయ’ వంటి సీరియల్స్ చేస్తూనే ‘బారిష్టర్ శంకర్ నారాయణ’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాకు రాజ్ కుమార్ భార్య నిర్మాత అయితే ఫేమస్ కోరియోగ్రాఫర్ తార మాస్టర్ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాజ్ కుమార్ డ్యూయల్ రోల్ లో చేసారు. ఈ సినిమా తెలుగులో ఎవరూ పట్టించుకోకపోయినా కన్నడ లో మాత్రం సూపర్ హిట్ అయింది.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…