Categories: FeaturedMovie News

Srikanth Iyengar : చిరు ఫ్యాన్ అని చెప్తే కొట్టారు… ఆరోజు చిరంజీవి వల్ల ఏడ్చాను : శ్రీకాంత్ అయ్యంగార్

Srikanth Iyengar : మామూలుగా డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెప్పడం వింటుంటాము. కానీ శ్రీకాంత్ అయ్యాంగార్ మొదట వైద్య వృత్తిలో ఉండి నటనమీద మక్కువతో యాక్టర్ గా మారిపోయాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ఎటాక్’ సినిమాతో మొదట సినిమాలలో కనిపించాడు. తరువాత కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, డియర్ కామ్రేడ్, బ్రోచే వాడెవడురా వంటి సినిమాలలో నటించారు. బ్రోచే వాడెవడురా సినిమాలో పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఇక సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో పాత్రతో నవ్వులు పూయించారు. ఇటీవల ‘అంటే సుందరానికి’ సినిమాలో నటించారు.

చిరు ఫ్యాన్ అని చెప్తే బాగా కొట్టారు…

శ్రీకాంత్ అయ్యంగార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా తనకు రామ్ గోపాల్ వర్మ గాడ్ ఫాదర్ అని చెప్పుకొచ్చారు. తన వలనే ఈ స్థానంలో ఉన్నాను అని చేర్పుకొచ్చారు. కెరీర్ ఆరంభంలో చాలా ప్రోత్సహించారు అని చెప్పారు. ఇక తన ఇష్టమైన హీరో అంటే మెగా స్టార్ చిరంజీవి గారు అని చెప్పారు. తన చిన్నప్పుడు ఖైదీ సినిమా చూసి ఆయనకు అభిమానిగా మారిపోయానని చెప్పారు. ఆ సినిమా వచ్చిన సమయంలో నేను కూడా ఆయన స్టైల్లో లో తలకు బెల్ట్ కట్టుకొని తిరిగేవాడినని అంత పిచ్చి అని చెప్పారు.

ఇక అది చూసి మా నాన్న ఎవరు రా… అని అడిగితే చిరు అని సమాధానం చెప్పేవాడినని, దాంతో మా నాన్న ఆ బెల్ట్ తోనే కొట్టేవాడని ఏడుపు వచ్చేది కానీ లోపల మళ్ళీ నేను చిరు అని కంట్రోల్ అయ్యే వాడిని అని చెప్పుకొచ్చారు. అదే అవతారంలో స్కూల్ కి కూడా వెళ్లే వాడిని అక్కడ కూడా మామూలే మళ్ళీ కొట్టేవారు అని చెప్పారు. అది జరిగిన 37 ఏళ్ళకి నేను నిజంగా చిరంజీవిని కలిశానని, ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. ఎవరితో కలసి నటించాలి అని ఉంది అడుగగా… ఒక్కసారి చిరంజీవి గారితో నటిస్తే చాలు అని చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago