Categories: FeaturedMovie News

Raja : ఒకే టైటిల్ తో వచ్చిన ఈ ఇద్దరి హీరోల చిత్రాలు.. కానీ బాక్సాఫీస్ వద్ద ఒక్కరే విజేతగా నిలిచారు.!!

ఆంధ్ర సోగ్గాడు శోభన్ బాబు,విక్టరీ వెంకటేష్ ఒకే టైటిల్ తో గల చిత్రాలలో నటించారు.
“రాజా”అనే టైటిల్ తో వచ్చిన ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలా పరుగులు తీసాయో చూద్దాం.
“రాజా” 1976 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో శోభన్ బాబు, జయసుధ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఎ.లక్ష్మీ కుమార్ మారుతీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. ఈ చిత్రానికి సలీం-జావెద్ కథ నందించగా సత్యానంద్ మాటలు రాశాడు.వి. ఎస్. ఆర్ స్వామి ఛాయాగ్రహణం, కోటగిరి గోపాలరావు కూర్పు బాధ్యతలు నిర్వహించారు. కె. చక్రవర్తి సంగీతాన్నందించగా ఆచార్య ఆత్రేయ, సి. నారాయణ రెడ్డి, ఆరుద్ర పాటలు రాశారు. పి. సుశీల, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం పాటలు పాడారు.

1999 లో ముప్పలనేని శివ దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మించిన విజయవంతమైన సినిమా”రాజా”. ఇందులో వెంకటేష్, సౌందర్య జంటగా నటించారు. ఎస్. ఎ. రాజ్ కుమార్ అందించిన స్వరాలు ప్రజాదరణ పొందాయి. ఈ సినిమా 1998లో తమిళంలో కార్తీక్, రోజా జంటగా వచ్చిన “ఉన్నిడతిల్ ఎన్నై కొడుతేన్” అనే సినిమాకు పునర్నిర్మాణం.
రాజా (వెంకటేష్)బాలు (సుధాకర్) తోడుదొంగలు. చిల్లర దొంగతనాలు చేస్తూ జీవితం గడుపుతుంటారు. ఒకసారి వినాయకుడి విగ్రహాన్ని దొంగిలించడానికి ఒప్పుకుని పోలీసులకు భయపడి ఒక ఇంట్లో దాక్కుంటారు. ఆ ఇంట్లో ఉన్న అంజలి(సౌందర్య) వీళ్ళని అక్కడే కొద్ది రోజులు బంధించి ఇంట్లో పనులు చేయించుకుని తర్వాత దొంగతనాలు మానేసి బుద్ధిగా బతకమని వదిలేస్తుంది. వీళ్ళు వెళ్ళేటపుడు బాలు దొంగతనంగా అంజలి(సౌందర్య) డైరీ తమతో పాటు తీసుకుని వెళతారు. దాని ద్వారా ఆమె గతం గురించి తెలుసుకుంటాడు రాజా. అతని జీవన విధానంలో నెమ్మదిగా మార్పు వస్తుంది.

అంజలి(సౌందర్య) తండ్రి లాయర్ విశ్వనాథం. ఆయన అంజలి తల్లిని రహస్యంగా పెళ్ళి చేసుకుని వదిలేసి ఉంటాడు. తర్వాత భాగ్యలక్ష్మి అనే ఆమెను వివాహం చేసుకుంటాడు. ఈలోపు అంజలి తల్లి మరణిస్తుంది. విశ్వనాథం భార్యకు భయపడి ఈమె బాగోగులు పెద్దగా పట్టించుకోడు. కానీ కొద్ది రోజులకు ఆమె మీద జాలితో స్నేహితుడి కూతురని అబద్ధం చెప్పి తన ఇంట్లోనే ఉంచుకుంటాడు. కానీ ఇంట్లో వాళ్ళంతా ఆమెను పనిమనిషిలా చూస్తుంటారు. ఒకసారి భాగ్యలక్ష్మి తమ్ముడు విదేశాల నుంచి వస్తాడు.అంజలి(సౌందర్య) అంటే అభిమానం చూపిస్తాడు. విశ్వనాథం ఆమెను అతనికిచ్చి వివాహం చేయాలనుకుంటాడు. కానీ అతను ఒప్పుకోడు.ఇదంతా తెలుసుకున్న రాజాకు ఆమె మీద జాలితో పాటు నెమ్మదిగా అభిమానం పెరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది మిగతా కథాంశం.


1976లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన శోభన్ బాబు చిత్రం”రాజా” పరాజయం పొందగా.. 1999 ముప్పలనేని శివ దర్శకత్వంలో వచ్చిన వెంకటేష్ చిత్రం”రాజా” బాక్స్ ఆఫీసు వద్ద ఘన విజయం సాధించింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago