Featured

Salmaan Khan: మూస్ వాలాను చంపినట్టు గానే నిన్ను చంపేస్తాం.. బెదిరింపులు అందుకున్న సల్మాన్ ఖాన్…

Salmaan Khan: ప్రస్తుతం సల్మాన్ ఖాన్  ‘కభీ ఈద్ కభీ దివాలి’ అనే సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమాలో సల్మాన్ కు జోడిగా పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇది కాకుండా సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హీరోయిన్ ‘టైగర్ 3’సినిమా కూడా మొదలుపెట్టారు. అయితే తాజాగా సల్మాన్ ఖాన్ అతని తండ్రి సలీమ్ ఖాన్ లను చంపేస్తామంటూ కొందరు దుండగులు బెదిరిస్తున్నారు.

 పంజాబ్ సింగర్ సిద్ధూకి పట్టిన గతే మీకు కూడా….

సల్మాన్ ఖాన్ తండ్ర అయిన సలీమ్ ఖాన్ కు రోజు ఉదయం లేవగానే వాకింగ్ కి వెళ్లే అలవాటు ఉంది. ఆలా వాకింగ్ కి వెళ్లిన సమయంలో రోజు ఒకే ప్లేస్ దగ్గర బ్రేక్ తీసుకుంటారు. అక్కడే బెదిరిపు లేఖ దొరికింది. అందులో పంజాబ్ సింగర్ సిద్దూ మూస్ వాలాను చంపినట్లే చంపేస్తామన్నట్లుగా రాసి పెట్టారు.

ఈ లేఖ తో అప్రమత్తమైన సల్మాన్ బాంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కి, అతడి తండ్రికి సెక్యూరిటి పెంచారు. అయితే కొన్ని రోజుల క్రితం పంజాబ్ సింగర్ సిద్ధూ మూస్ వాలాను తన సొంత విలేజ్ లోనే చంపిన సంగతి తెలిసిందే. బిష్ణోయ్ గ్రూప్ సిద్ధూని చంపినట్లుగా వెల్లడించింది. ఇప్పుడు వారే సల్మాన్ని కూడా బెదిరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో కూడా ఇలానే సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. కృష్ణజింకల వేట కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్ను వాటిని దైవంగా భావించే లారెన్స్ బిష్ణోయ్ కోర్టు ఆవరణలోనే చంపేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అపుడు బిష్ణోయ్ ముఠా సల్మాన్ హత్యకు ప్లాన్ కూడా చేశారని, కానీ పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారని కథనాలు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago