Rajamouli : ఇండస్ట్రీ లో డైరెక్టర్లకు ఇష్టమైన హీరోలు, హీరోలకు ఇష్టమైన డైరెక్టర్లు కామన్. పలానా హీరోతో వర్క్ చాలా కంఫర్ట్ గా ఉంటుందంటూ డైరెక్టర్ చెప్పడం వింటూనే ఉంటాం. మరి తెలుగులో ఇపుడు టాప్ డైరెక్టర్ అంటే దర్శకాధీరుడు రాజమౌళినే. అలాంటి రాజమౌళి కి ఎవరంటే ఇష్టం అంటే ఇది మళ్ళీ అడగాల్సిన ప్రశ్న కాదు, ఎన్టీఆర్ అని టక్కున చెబుతాడు. జక్కన్న, ఎన్టీఆర్ ల బంధం ఇద్దరి కెరీర్ ఒకసారి మొదలవడం తో మొదలయింది. స్టూడెంట్ నెంబర్ వన్ నుండి నేటి ఆర్ఆర్ఆర్ వరకు ఇంకా ఫ్యూచర్ లోను కొనసాగుతూనే ఉంటుంది.
ఎన్టీఆర్ మాత్రమే ఆ పాత్రలు చేయగలడు…
అయితే రాజమౌళి కి ఒక వింత ప్రశ్న ఎదురైంది.. అదే ఎన్టీఆర్ కు మీ సినిమాల ద్వారా బ్రేక్ ఇచ్చారు కదా అని. అయితే దీనికి రాజమౌళి మాట్లాడుతూ నేను తారక్ కి బ్రేక్ ఇవ్వలేదు ఒకరికి ఒకరం బ్రేక్ ఇచ్చుకున్నాం. సింహాద్రి, యమదొంగ వంటి సినిమాలను ఎన్టీఆర్ తో కాకుండా వేరే హీరోలతో ఉహించుకోలేను. ఆ పాత్రలు ఎన్టీఆర్ మాత్రమే చేయగలడు, ఇంకెవరూ చేయలేరు. ఎన్టీఆర్ తో సినిమా అంటే కథ కూడా వినడు నా మీద అంత నమ్మకం.
నాకు ఎన్టీఆర్ తో సినిమా అంటే స్క్రిప్ట్ రాయడానికి ఫ్రీడమ్ ఉంటుంది. నేను ఉహించి రాసే ఏ స్క్రిప్ట్ అయినా ఎన్టీఆర్ చేయగలడు. కాబట్టి నేను భయపడాల్సిన పనిలేదు ఎలా అయినా రాయొచ్చు. నేను ఎలా ఊహిస్తానో అది చెప్పక ముందే ఎన్టీఆర్ పట్టేస్తాడు అలా నటిస్తాడు. ఎన్టీఆర్ మీరు ఫ్రీ టైం లో ఏమి మాట్లాడుకుంటారు అని అడుగగా సోది మాట్లాడుకుంటాము. ఇక మా ఫ్యామిలీ అయితే ఎక్కువగా తిండి గురించి ఎక్కువ చర్చిస్తాము అంటూ చెప్పారు జక్కన్న.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…