Featured

Sadha : నాలుగు పదుల వయసు వస్తున్నా అలాంటివాడు దొరకలేదట.. అందుకే పెళ్లి చేసుకోలేదట.. నమ్మొచ్చా..?

Sadha : ‘జయం’ సినిమాతో ట్రెడిషనల్ అమ్మయిగా మంచి మార్కులు కొట్టేసిన అమ్మడు సదా. ఈ బెంగుళూరు అమ్మయి జయం సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇక వరుస ఆఫర్స్ తో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. దొంగ దొంగది, నాగ, అపరిచితుడు, అవునన్నా కాదన్న వంటి సినిమాల్తో అలరించిన సదా ఆ తరువాత వెండి తెరకు దూరమైంది. చాలా రోజులకు ఒకటీ అరా సినిమాలు తీసినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇక ఈటీవీలో ఢీ షోకి జడ్జి గా కూడా కొద్ది రోజులు వచ్చిన సదా మళ్ళీ అడ్రెస్ లేదు.

నన్ను ఇష్టపడే వాడు దొరకలేదు…

ఇక మళ్ళీ చాలా రోజుల తరువాత సదా యూట్యూబ్ లో సొంత ఛానెల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని మంచి కథ, పాత్ర అయితే సిద్ధమని హింట్లు ఇచ్చింది. ఇక వెబ్ సిరీస్ లతో కూడా రావడానికి సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ. అయితే అమ్మడు నాలుగు పదుల వయసుకి చేరువలో ఉన్నా ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనే అనుమానం అందరికీ వస్తోంది. ఇక దీనికి అమ్మడి సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇంతకీ ఈ అమ్మడు ఏమి చెప్పిందంటే పెళ్లి మీద ఆలోచన లేదు అంటూనే.. ఇంతవరకు నాకు ఎదురైన వాళ్లందరూ నా సంపాదన చూసి వచ్చిన వారే, నన్ను నన్నుగా ఇష్టపడి వచ్చినవారు ఎవరూ కనపడలేదు. నా సంపాదన మీద ఆధార పడకుండా ఎవరైనా తగిలితే పెళ్లి చేసుకుంటా అంటూ చెప్పింది. కానీ సదా లాంటి అందమైన అమ్మాయికి కేవలం ఆమె సంపాదన చూసే పెళ్లి చేసుకునే వారు ఉంటారా, ఆమెను చూసి చేసుకునే వాళ్ళే లేరా. ఇంత చిన్న కారణంతో అమ్మడు పెళ్లి చేసుకోలేదంటే నమ్మాలనిపించదు కదా. కానీ అసలు విషయం ఏమిటో సదా కి మాత్రమే తెలుసు.

Bhargavi

Recent Posts

ప్రేమించి పెళ్లి… చివరకు భర్త హత్య! హోలోగ్రామ్‌తో బయటపడిన షాకింగ్ కుట్ర

ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…

11 hours ago

అషు రెడ్డి-టెక్కీ వివాదంలో ఆడియో బాంబ్

బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…

11 hours ago

ఒక్క ఛాన్స్ కోసం తిరిగిన సత్యరాజ్.. కట్టప్పగా వరల్డ్ ఫేమ్

దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…

11 hours ago

“ఆ హీరో నా జీవితంలో గాడ్ ఫాదర్”.. అనుష్క ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…

11 hours ago

“వినాశకాలే విపరీత బుద్ధి”.. యువతకు కఠిన హెచ్చరిక

ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…

12 hours ago

మోదీని డైరెక్ట్‌గా కలుస్తా.. మంచు లక్ష్మి రాజకీయ వ్యాఖ్యలు వైరల్

టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…

13 hours ago