Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డైరెక్టర్ గా తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలోనూ అలాగే అంతర్జాతీయ స్థాయిలోని ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి రాజమౌళి త్వరలోనే మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.
మరి ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు ఉంటారనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఇకపోతే రాజమౌళి సినిమాలు అంటే ఏ స్థాయిలో ఉంటాయో మనకు తెలిసిందే. ఈయన సినిమాలకు ఆస్కార్ అవార్డు రావడం అంటే ఈయన సినిమాలపరంగా చూపించే డెడికేషన్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. ఇలాంటి ఒక స్టార్ డైరెక్టర్ సినిమాలలో నటించాలని చాలామంది హీరోయిన్స్ ఆరాటపడుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఎంతోమంది హీరోయిన్లు జక్కన్న సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నామంటూ బహిరంగంగా తెలియజేశారు. ఇలా తన సినిమాలో అవకాశం కోసం హీరోయిన్లు ఎదురు చూస్తుండగా రాజమౌళికి మాత్రం ఇండస్ట్రీలో ఇద్దరి హీరోయిన్స్ అంటే మాత్రం చాలా ఇష్టమని ఓ సందర్భంలో తెలియజేశారు . మరి జక్కన్నకు ఇష్టమైన హీరోయిన్స్ మరెవరో కాదు ఒకరు అనుష్క మరొకరు సలోని.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు బాహుబలి సినిమాలో అనుష్క నటించారు. అనుష్క నటన పరంగా చాలా అద్భుతంగా నటిస్తారనే సినిమా పట్ల చాలా డెడికేషన్ ఉన్నటువంటి వ్యక్తి అంటూ రాజమౌళి అనుష్క గురించి తెలిపారు. అందుకే తను తన ఫేవరెట్ హీరోయిన్ అని తెలిపారు. అలాగే సలోని కూడా సినిమాలపరంగా అలాంటి డెడికేషన్ చూపిస్తారు. సలోని సునీల్ హీరోగా నటించిన మర్యాద రామన్న సినిమాలో హీరోయిన్గా నటించి మెప్పించారు.
దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…
ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…