Movie News

Naveen: మహేష్ అన్నతో మంచి బాండింగ్ ఉంది… వైరల్ అవుతున్న నరేష్ కుమారుడు నవీన్ కామెంట్స్!

Naveen: నవీన్ అంటే తెలియకపోవచ్చు కానీ సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్ అంటే మాత్రం అందరూ తప్పక గుర్తుపట్టారు. ఈయన కెరియర్లో హీరోగా ఒకే ఒక సినిమాలో నటించారు. హీరోగా నవీన్ మెప్పించకపోవడంతో ఈయన దర్శకుడిగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఈయన సాయి ధరమ్ తేజ్ హీరోగా సత్య అనే షార్ట్ ఫిలింకి దర్శకుడిగా వ్యవహరించారు.

ఇదిలా ఉండగా గత కొంతకాలంగా ఈయన వరుస ఇంటర్వ్యూలో హాజరవుతూ తన ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు. తన నానమ్మ విజయనిర్మల చనిపోవడంతోనే ఆ జ్ఞాపకాలను మర్చిపోలేక అదే బాధలో ఉండే కృష్ణ గారు కూడా చనిపోయారు అంటూ నవీన్ తెలియచేశారు.

నానమ్మ చనిపోయిన తర్వాత మహేష్ బాబు గారు కృష్ణ గారిని తన ఇంటికి తీసుకెళ్లడానికి చాలా బ్రతిమలాడారు. కానీ అక్కడ 40 సంవత్సరాలు పాటు నాన్నమ్మతో కలిసి ఉన్నటువంటి కృష్ణ గారు ఆ జ్ఞాపకాలను విడిచి వెళ్లలేక అదే ఇంట్లోనే ఉండే వారిని నవీన్ తెలిపారు. ఇక కృష్ణ గారు మరణించిన తర్వాత మహేష్ బాబుతో నాకు మంచి బాండింగ్ ఉందని తెలిపారు.

Naveen: రమ్య రఘుపతి గారు నాతో మాట్లాడేవారు…


ఇప్పటికి కూడా మహేష్ అన్న రెండు మూడు రోజులకు ఒకసారి కాల్ చేసి నాతో మాట్లాడతారని లేదా నేనైనా తనుకు చేస్తూ ఉంటానని నవీన్ తెలిపారు. ఇలా మహేష్ గారితో తనకు మంచి బాండింగ్ ఉందని నవీన్ తెలిపారు. ఇక రమ్య రఘుపతి గురించి కూడా మాట్లాడుతూ ఆమె నా వరకు చాలా మంచిగానే ఉండేదని ఎప్పుడు మాట్లాడిన మంచిగానే మాట్లాడించేవారు అంటూ ఈ సందర్భంగా నవీన్ తెలిపారు. నాన్నతో ఆమెకు ఉన్నటువంటి గొడవలు అది పూర్తిగా వారి వ్యక్తిగతం అని నా వరకు అయితే చాలా మంచిగా ఉండే వారని తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…

20 hours ago

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…

20 hours ago

ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ టమాటాలు.. గుర్తించే సింపుల్ టెస్టులు ఇవే..

ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…

21 hours ago

మామిడి పండ్లు తిన్న తర్వాత అనారోగ్యం.. ఇద్దరు బాలికల మరణం కలకలం

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…

21 hours ago

ప్రపంచానికి కొత్త వాతావరణ హెచ్చరిక.. ‘గాడ్జిలా ఎల్‌నినో’పై నిపుణుల ఆందోళన

ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

23 hours ago

నాన్న ఇప్పటికీ ఆటోనే నడుపుతున్నారు..స్టార్ కొరియోగ్రాఫర్ అయినా సొంత ఇల్లు లేదు..పండు మాస్టర్ ఎమోషనల్ స్టోరీ

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…

23 hours ago