Rajamouli: తండ్రి విజయేంద్ర ప్రసాద్ అలాంటి పనిచేయడంతో కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి… అసలేం జరిగిందంటే?
Rajamouli: ప్రముఖ సినీ రచయితగా విజయేంద్రప్రసాద్ అందరికీ సుపరిచితమే. సినీ రచయితగా మాత్రమే కాకుండా రాజమౌళి తండ్రిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలన్నింటికీ కూడా విజయేంద్రప్రసాద్ కథ అందిస్తారు. బాహుబలి 1,2 నుంచి నేడు విడుదలైన RRR వరకు ఈయన అద్భుతమైన కథను అందించారు.
ఈ విధంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసిన సినిమా కథలలోఒక సినిమా కథ విషయంలో రాజమౌళి చాలా హర్ట్ అయ్యారు అని ఆ రోజు తన తండ్రి చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్నారు అని వెల్లడించారు. ఏం జరిగింది అనే విషయానికి వస్తే… విజయేంద్రప్రసాద్ రచించిన భజరంగీ భాయ్ జాన్ కథ సల్మాన్‌కు చెప్పాననగానే రాజమౌళి కళ్ళల్లో నీళ్లు తిరిగాయని వెంటనే కన్నీళ్లు పెట్టుకున్నారు అని తెలిపారు.
ఆ విధంగా రాజమౌళి కళ్ళలో నీళ్ళు చూసి కథ మన దగ్గరే ఉంది చెయ్యనా అని చెప్పగా రాజమౌళి వద్దు వారికి ఇచ్చేయమని చెప్పారు. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఒకరోజు రాజమౌళి తన వద్దకు వచ్చాడు.ఆ సమయంలో బాహుబలి సినిమా 2 వేల మంది ఆర్టిస్టులతో మంచి ఎండలో ఒక ఫైట్ సన్నివేశం జరుగుతుంది.
అలా బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో మంచి కాక మీద ఉన్నప్పుడు రాజమౌళి తన వద్దకు వచ్చి 15 రోజుల ముందు లేదా తర్వాత అడిగి ఉంటే ఈ కథ నేను తీసేవాడిని కదా అన్నారని ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ తనకు రాజమౌళికి మధ్య జరిగిన సంభాషణ గురించి ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…