Featured

RRR Movie Review : “ఆర్ఆర్ఆర్” సినిమా రివ్యూ & రేటింగ్.. !

చిత్రం : RRR
బ్యాన‌ర్ : డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
న‌టీన‌టులు : ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్, ఆలియా భ‌ట్‌, స‌ముద్ర ఖ‌ని, శ్రియా శ‌ర‌న్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం : ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి
నిర్మాత‌: డి.వి.వి.దాన‌య్య‌
సినిమాటోగ్ర‌ఫీ: కె.కె.సెంథిల్ కుమార్‌
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
క‌థ‌: విజ‌యేంద్ర ప్ర‌సాద్‌
ఎడిటింగ్‌: ఎ.శ్రీక‌ర్ ప్ర‌సాద్‌
మాట‌లు: సాయి మాధ‌వ్ బుర్రా
సెన్సార్ : యు/ఎ
వ్య‌వ‌ధి : 3 గంట‌లు 6 నిమిషాలు

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్, హై టెక్నిక‌ల్ వేల్యూస్ ఉన్న‌మూవీ RRR. టాలీవుడ్ స్టార్ హీరోలైన మెగా ప‌వ‌ర్ స్టార్‌ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో సినిమా తెర‌కెక్క‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. రెండేళ్ల ముందే విడుద‌ల కావాల్సిన ఈ సినిమా క‌రోనా కార‌ణంతో ఇప్పుడు విడుద‌లైంది. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా కావ‌డంతో పాటు… ఇందులో గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. 1920 కాలంలో బ్రిటీష్ వారిపై తిర‌గ‌బ‌డ్డ ఇద్ద‌రు యోధుల ఫిక్ష‌న‌ల్ క‌థాంశంతో RRR సినిమా రూపొందడంతో సినిమాపై అనుకున్న దానిక‌న్నా ఎక్కువ అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ డ్రామా ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు మెప్పించిందో చూద్దాం…

క‌థ‌:

1920 కాలంలో బ్రిటీష్ నేప‌థ్యంలో స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటం నేప‌థ్యంలో సాగే చిత్రంగా RRR ను ఆవిష్క‌రించారు. అస‌లు క‌థ ఆదిలాబాద్‌లో ప్రారంభం అవుతుంది. అక్కడ నుంచి బ్రిటీష్ గ‌వ‌ర్న‌ర్ అయిన స్కాట్ ఓ గోండు పిల్ల‌ను తీసుకుని ఢిల్లీకి వెళ్లిపోతాడు. ఆ పాప‌ను కాపాడటానికి గోండు జాతికి కాప‌రిగా ఉంటున్న కొమురం భీమ్ (ఎన్టీఆర్‌) ఢిల్లీ చేరుకుంటాడు. అదే స‌మ‌యంలో విశాఖ పట్నంకు చెందిన రామ‌రాజు(రామ్ చ‌ర‌ణ్‌) బ్రిటీష్ సైన్యంలో పోలీస్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. త‌న‌కు బ్రిటీష్ ఆయుధ భాండాగారినికి స్పెష‌ల్ ఆపీస‌ర్ కావాల‌నేది ల‌క్ష్యం. ఆదిలాబాద్ నుంచి గోండు భీమ్ ఢిల్లీ చేరుకున్నాడ‌ని నిజాం ప్ర‌భువు ద్వారా బ్రిటీష్ గ‌వ‌ర్న‌ర్‌కి విష‌యం తెలుస్తుంది. త‌న‌ను ప‌ట్టుకున్న వారికి ప్ర‌మోష‌న్ ఇస్తాన‌ని స‌ద‌రు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌క‌టిస్తాడు. దాంతో భీమ్‌ను ప‌ట్టుకోడానికి రామ‌రాజు ముందుకు వ‌స్తాడు. ఒక‌రికి ఒక‌రు తెలియ‌కుండా ద‌గ్గ‌ర‌వుతారు. ఓ సంద‌ర్భంలో తాను ప‌ట్టుకోవాల‌నుకున్న భీమ్‌తోనే తాను ఉంటున్నాన‌ని తెలుసుకుంటాడు రామ‌రాజు. పాప‌ను కాపాడ‌టానికి భీమ్‌.. అత‌న్ని పట్టుకోవ‌డానికి రామ్ .. పెద్ద యుద్ధ‌మే జ‌రుగుతుంది. చివ‌ర‌కు భీమ్‌ను రామ‌రాజు ప‌ట్టుకుంటాడు. అస‌లు క‌థ అక్క‌డి నుంచే ప్రారంభం అవుతుంది. అస‌లు రామ‌రాజు గ‌తం ఏంటి? భీమ్, రామ్ మ‌ధ్య స్నేహం ఎక్క‌డికి దారి తీస్తుంది. బ్రిటీష్ వారిని వారిద్ద‌రూ ఎదిరించారా? త‌మ ఆశ‌యాల వైపుకు అడుగులు వేశారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేష‌ణ‌:

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి సినిమాల‌ను గ‌మ‌నిస్తే.. ఆయ‌న తీసింది త‌క్కువ సినిమాలే అయినా ఆయ‌న ప్ర‌తీ సినిమా ప్రేక్ష‌కుల‌కు గుర్తుండిపోయింది. అందుకు కార‌ణం.. ఆయ‌న సినిమాలోని పాత్ర‌లు బ‌లంగా ఉంటాయి. భావోద్వేగాల‌కు ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అవుతారు. అలా జ‌క్క‌న్న స‌న్నివేశాల‌ను మ‌లుచుకుంటూ వ‌స్తారు. అందుక‌నే ఆయ‌న తెర‌కెక్కించిన బాహుబ‌లి తెలుగు సినిమా స‌త్తాను ప్ర‌పంచానికి చాటింది. అలాంటిది ఇప్పుడు ఇద్ద‌రు టాలీవుడ్ అగ్ర హీరోలు. ఒక‌రేమో మెగా ఫ్యామిలీ హీరో.. మ‌రొక‌రేమో నంద‌మూరి ఫ్యామిలీ హీరో. ఈ రెండు కుటుంబాల‌కు చెందిన హీరోల‌ను ఒకే సినిమాలో న‌టింప చేయ‌డ‌మంటేనే సాహసం. అలాంటిది ఇద్ద‌రి ఫ్యాన్స్ మెప్పించేలా ఇద్ద‌రి పాత్ర‌ల‌ను అద్భుతంగా వెండితెర‌పై ఆవిష్క‌రించారు రాజ‌మౌళి.

రామ్ చ‌ర‌ణ్‌ను నిప్పుగా.. ఎన్టీఆర్‌ను నీరుగా చూపించారు. పంచ భూతాల్లో ప్ర‌ధాన‌మైన ఆ రెండు శ‌క్తులు ఏక‌మైతే ఎలా ఉంటుంద‌నే అంశాన్ని ముందు నుంచి ఎలివేట్ చేసుకుంటూ వ‌చ్చారు. రామ్ చ‌ర‌ణ్ రెండు వేల మంది మ‌ధ్య చేసే ఫైట్‌.. అలాగే అడ‌విలో అడ‌వి తోడేలు, పులితో ఫైట్ చేసేలా ఎన్టీఆర్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సింపుల్‌గా అదిరిపోయింది. అలాగే ఇద్ద‌రి మ‌ధ్య ఫ్రెండ్ షిప్‌ను ఆవిష్క‌రించి తీరు బావుంది. అందు కోసం బ్రిడ్జ్ ట్రైన్ యాక్ష‌న్ సీక్వెన్స్ అమేజింగ్‌గా చిత్రీక‌రించారు. ఇక నాటు నాటు సాంగ్ కూడా ఇద్ద‌రి హీరోల ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ అనే చెప్పాలి. త‌ర్వాత ఇంట‌ర్వెల్ ఫైట్ సీక్వెన్స్ సినిమాకు మ‌రో హైలైట్‌. ఇద్ద‌రు స్టార్స్ నువ్వా నేనా అని పోటీ ప‌డేలా యాక్ష‌న్ సీక్వెన్స్‌ను చిత్రీక‌రించారు.

ఇక ప్రీ క్లైమాక్స్‌లో రామ్ చ‌ర‌ణ్‌.. ఎన్టీఆర్ కోసం చేసే యాక్ష‌న్ సీక్వెన్స్ అందులో ఎమోష‌న్స్ ప్రేక్ష‌కుల‌ను సీట్స్‌కు క‌ట్టిప‌డేశాయ‌న‌డంలో సందేహం లేదు. ఇక ఈ ఇద్ద‌రి హీరోల‌కు సంబంధించిన ఎమోష‌నల్ క‌నెక్టింగ్ పాయింట్స్‌గా అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్ పాత్ర‌లు స‌న్నివేశాల‌ను మ‌రో రేంజ్‌లో నిల‌బెట్టాయి. చివ‌ర‌కు రామ్ చ‌ర‌ణ్ క్యారెక్ట‌ర్ గురించి తెలుసుకుని అత‌న్ని కాపాడ‌టానికి భీమ్ వెళ్ల‌డం అక్క‌డ జ‌రిగే ఉత్కంఠ‌మైన పోరు అన్ని గూజ్ బ‌మ్స్ తెప్పిస్తాయ‌న‌డంలో సందేహం లేదు. ఇక స‌న్నివేశాల‌కు కీర‌వాణి త‌న సంగీతం, నేప‌థ్య సంగీతంతో ప్రాణం పోశారు. విజువ‌ల్ ఎఫెక్ట్ గొప్ప‌గా ఉన్నాయి. ఎందుకంటే అవి క‌థ‌లో భాగంగా మ్యాచ్ అయిన తీరు చూస్తే ఇది నిజ‌మో, ఏది విజువ‌ల్ ఎఫెక్టో అర్థం కాదు. అంత ఎఫెక్టివ్‌గా ఉన్నాయి.

ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ పోటీ ప‌డి న‌టించారు. ఇద్ద‌రు హీరోల ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ఆర్ నిజ‌మైన ట్రీట్‌. యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంత‌ట అవే వ‌స్తాయంటూ అజ‌య్ దేవ‌గ‌ణ్‌తో డైలాగ్ చెప్పిన సంద‌ర్భం.. ఇలా కొన్ని చోట్ల డైలాగ్స్ నిప్పు క‌ణిక‌ల్లా పేలాయి.

చివ‌ర‌గా…

RRR… ఎన్టీఆర్ – రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌ను మెప్పించేలా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేలా రాజ‌మౌళి తెర‌కెక్కించిన మ‌రో మాస్ట‌ర్ పీస్‌..

రేటింగ్ : 3.75/5

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

2 days ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

2 days ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

2 days ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago