Featured

రాజమౌళి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అందుకే సెట్ అవలేదు.. స్వయంగా వెల్లడించిన జక్కన్న రాజమౌళి..

పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అందుకే సెట్ అవలేదు..స్వయంగా వెల్లడించిన జక్కన్న దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. బాహుబలి సినిమాలతో తెలుగువ్వరి సత్తా ఏంటో చాటిచెప్పిన దర్శకుడిగా రాజమౌళి గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్, పాన్ వరల్డ్ స్టార్‌గా విపరీతమైన స్టార్ డం సంపాదించుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కమిటయిన ప్రాజెక్ట్స్ మార్కెట్ వవాల్యూ మూడు నించి నాలుగు వేల కోట్లు అని అంచనా వేస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీస్‌గా రిలీజ్ అయ్యే ఈ సినిమాల వసూళ్ళు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు.

ఇక బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న మరో పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా నటిస్తున్న ఇందులో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఆలియా భట్, సీనియర్ స్టార్ హీరో అజయ్ దేవగన్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్, శ్రియ శరణ్, సముద్రఖని లాంటి అగ్ర తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. గత ఏడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా వేవ్స్ కారణంగా ఆగిపోయింది.

ఎట్టకేలకి అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటూ వస్తున్న ఆర్ఆర్ఆర్ 2022, జనవరి 7న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా 10 భాషలలో ఏకకాలంలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ పివీఅర్‌తో టైఅప్ అయింది. ఇటీవలే ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేశారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌ను రాజమౌళి మొదలు పెట్టేశారు. దుబాయ్‌లో భారీ స్థాయిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఏపీ తెలంగాణలో కూడా ఇదివరకు ఎన్నడూ లేని విధంగా రాజమౌళి ప్రమోషన్స్‌ను ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా శ్రీకాకుళంలో ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో అభిమానులు రాజమౌళిని పలు ఆసక్తికరమైన ప్రశ్నలను అడిగారు. ఇందులో భాగంగా ఓ అభిమాని మీరు – పవన్ కళ్యాణ్ కలిసి ఎప్పుడు సినిమా చేస్తారని అడిగాడు. ఆ ప్రశ్నకు రాజమౌళి ఇచ్చిన సమాధానం..నేను ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని కలిశాను. మీతో సినిమా చేఅయలనుకుంటున్నాని చెప్పాను. ఆయన కూడా సరే అన్నారు. మీకు ఎలాంటి కథ అయితే బావుంటుందనుకుంటున్నారు అని అడిగాను. అప్పుడు ఆయన మీరు ఎలాంటి కథ నాతో చేద్దామనుకుంటున్నారో చెప్పండి..నాకు ప్రత్యేకంగా ఇలాంటి కథే చేయాలనేమీ లేదు అన్నారు.  

ఆ తర్వాత ఆయన నుంచి కాల్ వస్తుందేమో అని ఓ సంవత్సరంన్నర వెయిట్ చేశాను. కానీ ఆయన నుంచి కాల్ రాలేదు. ఈలోపు ఆయన వేరే వేరే సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. నేను మగధీర, యమగదొంగ వంటి లార్జర్ దాన్ లైఫ్, నంబర్ ఆఫ్ డేస్ షూటింగ్ చేసే సినిమాలతో బిజీ అయ్యాను. ఆయన సినిమాలకంటే రాజకీయాల మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అలా మా ఇద్దరి పాత్స్ డిఫరెంట్ అయ్యాయని అందుకే పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయలేకపోయానని జక్కన్న వెల్లడించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago