తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో వందల చిత్రాల్లో విభిన్న పాత్రలో అద్భుతమైన నటన ద్వారా ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటుడు కైకాల సత్యనారాయణ ఒకరు. ఇండస్ట్రీలో బహుశా ఈయన వెయ్యని పాత్ర అంటూ ఉండదేమో.ఎన్నో విభిన్న పాత్రల్లో స్టార్ హీరోలందరి సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న కైకాల సత్యనారాయణ ఆస్పత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
కైకాల సత్యనారాయణ గత నాలుగు రోజుల క్రితం ఇంటిలో కాలుజారి కిందపడ్డారని తెలుస్తోంది. ఈ క్రమంలోని ఇంట్లోనే ఉన్న కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి తీవ్రతరం కావడంతో ఆయన కుటుంబ సభ్యులు అతనిని మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే కైకాల ఆస్పత్రి పాలయ్యారన్న వార్త తెలియగానే అభిమానులు ఆందోళన చెందారు.
ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య విషయంపై కైకాల కుటుంబ సభ్యులు స్పందిస్తూ ఆయన ఆరోగ్య పరిస్థితిని వెల్లడించారు.ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని కుటుంబ సభ్యులు తెలియజేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇప్పటికే కన్నడ సినీ నటుడు పునీత్ మరణం నుంచి కోలుకోలేని అభిమానులకు కైకాల ఆసుపత్రి పాలయ్యారన్న విషయం తెలియడంతో ఆందోళన చెందారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…