నందమూరి నటసింహం బాలకృష్ణ మొట్టమొదటిసారిగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి కార్యక్రమం “అన్ స్టాపబుల్”. నవంబర్ 4 నుంచి ఈ కార్యక్రమం అహాలో ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి మొదటి గెస్ట్ ఎవరు వస్తారు అంటూ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే గతంలోబాలకృష్ణ మోహన్ బాబు సెల్ఫీ దిగిన ఫోటో వైరల్ కావడంతో మొదటి గెస్ట్ గా మోహన్ బాబు వస్తారని భావించారు. ఈ కార్యక్రమంలోనే మొదటి గెస్ట్ గా మోహన్ బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న, విష్ణు వచ్చారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ పలు ఆసక్తికరమైన ప్రశ్నలు వేశారు.ఇందులో భాగంగానే తను నటించిన సినిమాలలో తాను చూడని సినిమా ఏంటని బాలకృష్ణ ప్రశ్నించారు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గురించి మోహన్ బాబు వ్యక్తిగత అభిప్రాయం ఏంటని ప్రశ్నించారు. మరి ఈ ప్రశ్నలకు మోహన్ బాబు ఎలాంటి సమాధానం చెప్పారు అనేది ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగింది.
అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా మోహన్ బాబు మంచు లక్ష్మిని వేదికపైకి పిలిచి ఎంతో సరదాగా వారితో ముచ్చటించారు. ఇదిలా ఉండగా సినీ కెరీర్ లో తను ఎదుర్కొన్న కష్టాల గురించి మోహన్ బాబును అడగడం తో తన పిల్లలకు తెలియకుండా తన ఇంటిని అమ్ముతున్న విషయాన్ని గుర్తు చేసుకుని మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు.
ఈ క్రమంలోనే ఇంత బాధలు నిన్ను కూడా నేను ఒక ప్రశ్న అడుగుతా సోదరా అంటూ మోహన్ బాబు బాలకృష్ణ ప్రశ్నించారు. అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని అన్నగారి మరణం తర్వాత వారుసుడిగా పార్టీ పగ్గాలు నువ్వు తీసుకోకుండా చంద్రబాబుకి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.ఇందుకు బాలకృష్ణ సమాధానం చెబుతూ మరి అన్న గారి పార్టీ వదిలేసి వేరే పార్టీలోకి ఎందుకు జాయిన్ అయ్యారు అంటూ తిరిగి ప్రశ్నించారు.మన ఇద్దరికీ ఒక ఆయన ఫిట్టింగ్ పెడుతున్నాడు అతని ఈ ప్రశ్నలన్నీ అడగమని చెప్పాడు అంటూ అల్లు అరవింద్ గురించి మోహన్ బాబు చెప్పుకొచ్చారు. మరి ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్న ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.మరి ఈ కార్యక్రమం ఏవిధంగా కొనసాగుతుంది బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు మోహన్ బాబు ఎలా సమాధానం చెప్పారు అనే విషయాలు తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…