Rajamouli: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కెరియర్ మొదట్లో సీరియల్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ బుల్లితెరకు మాత్రమే పరిచయమయ్యారు.ఇలా బుల్లితెర డైరెక్టర్గా కొనసాగుతున్నటువంటి ఈయన ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ అందుకున్నటువంటి రాజమౌళి తన తదుపరి సినిమా సినిమాకు సరికొత్త మెరుగులు దిద్దుతూ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా పేరుపొందారు.
ఇలా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ సాధించినటువంటి రాజమౌళి తన సినిమాలకు భారీ బడ్జెట్ ఖర్చు చేయడంతో ఎందరో రాజమౌళికి పిచ్చి పట్టిందా ఇంత డబ్బు ఖర్చు చేస్తే సినిమాని ఎలా మార్కెట్ చేయాలి అంటూ మాట్లాడారు. అయితే ఈ మాటలకు తాను వెనుకడుగు వేయలేదు. ఇలా తన సినిమా సినిమాకు కొత్తదనం చూపెడుతూ ఎంతో పేరు పొందిన ఈయన బాహుబలి సినిమాతో ఏకంగా తెలుగు సినిమా సత్తా ఏంటో పాన్ ఇండియా స్థాయిలో చాటి చెప్పారు.
ఇలా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడంతో మరి ఎంతో మంది దర్శకులు రాజమౌళి బాటలోనే తమ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తూ వచ్చారు. ఇలా బాహుబలి సినిమాతో తన స్థాయి పెరిగిందని రాజమౌళి ఆగిపోకుండా మరొక అడుగు ముందుకు వేస్తూ ఇద్దరు ఒకే జనరేషన్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేసి అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాకి ఎంతో మంచి ఆదరణ తీసుకోవచ్చేలా ప్రయత్నం చేశారు.
ఇలా ఒక తెలుగు సినిమా అంతర్జాతీయ వేదికపై ఆస్కార్ వంటి గొప్ప అవార్డు అందుకోవడం వెనుక రాజమౌళి కృషి ఎంతో ఉందని చెప్పాలి. ఇలా పాన్ ఇండియా సినిమాల వరకే మాత్రమే ఆగిపోకుండా ఆస్కార్ అవార్డులకు కూడా దారి చూపించిన ఘనత జక్కన్నకే చెల్లింది. అయితే ఈ సినిమా కోసం ఈయన భారీగా ఖర్చు చేశారంటూ కూడా వార్తలు వచ్చాయి. నిజమే ఈయన సినిమా నామినేషన్ లో నిలవడంతో ఆ సినిమాని మరింత ప్రేక్షకులకు చేరువుగా తీసుకెళ్లడం కోసం ప్రమోషన్లను నిర్వహించారు. ఇలా ఎక్కడ వెనుకడుగు వేయకుండా సరిహద్దులను చెరిపేస్తూ అంతర్జాతీయ వేదికపై ఒక తెలుగు సినిమా ఆస్కార్ అందుకోవడానికి జక్కన్న కారణమయ్యారని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…