Featured

జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆ సన్నివేశంపై ఎక్కువ శ్రద్ధ వహించారట.. ఎందుకో తెలుసా?

నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్), మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను 2022, జనవరి 7న విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైల‌ర్‌ను డిసెంబ‌ర్ 3న విడుద‌ల చేయాల‌నుకుని వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే.

తాజా స‌మాచారం మేర‌కు జ‌క్క‌న్న అండ్ టీమ్ మ‌రో డేట్‌ను ఫిక్స్ చేశార‌ట‌. దానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని స‌మాచారం. తెలిసిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను డిసెంబర్ 09న విడుదల చేయనున్నట్లు జక్కన్న టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు ట్రైలర్ విడుదల కోసం ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎందో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా ఆథ్యంతం ఎమోషనల్ తో ఆకట్టుకుంటుందని టాక్ వినిపిస్తోంది. బ్రిటీషర్ తో జరిగే పోరాట సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్‌కి చెందిన ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. దీనిలో అజయ్ దేవగణ్ భార్యగా శ్రీయ నటించారు. అయితే ఈ సినిమాలో జక్కన్న ఓ సన్నివేశంపై ఎక్కువ శ్రద్ధ తీసుకొని చేశారట.

ఆ సన్నివేశం దాదాపు 30 నిమిషాల నిడివి ఉంటుందని.. ఈ సన్నివేశంలోనే అజయ్ దేవగణ్ భార్య శ్రీయ మరణిస్తారట. అంతే కాకుండా రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఈ సన్నివేశంలోనే తారసపడుతారనేది టాక్. ఎంతో ఎమోషనల్ టచ్ గా ఉండే దీనిపై జక్కన్న తన ప్రతిభను చూపించినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశంలో జరిగే ప్రతీ సీన్ ఎలాంటి కట్ లు లేకుండా.. అలానే సినిమాలో పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

3 weeks ago