ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య శనివారం ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం అతడి వయస్సు 88 ఏళ్లు. తమిళనాడు గవర్నర్‌గా పనిచేసిన కొణిజేటి రోశయ్య ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. ఉదయం 8.20 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. కాగా సుదీర్ఘ రాజకీయ నేపథ్యమున్న ఈ కాంగ్రెస్ సీనియర్ నేత మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కొణిజేటి రోశయ్య మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. రోశయ్య గారు మరణించినందుకు బాధగా ఉంది. మేమిద్దరం ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పుడు.. ఆ తర్వాత తమిళనాడు గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆయనతో నేను జరిపిన సంప్రదింపులను తాను గుర్తుచేసుకున్నారు. ప్రజాసేవకు ఆయన చేసిన కృషి గుర్తుండిపోతుందన్నారు. ఆయన కుటుంబసభ్యులకు మరియు మద్దతుదారులకు సానుభూతి తెలియజేస్తున్నాను. . ఓం శాంతి అని ప్రధాని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
అతడి మృతి పట్ల మెగస్టార్ చిరంజీవి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళి అర్పించారు. ఆయన ట్విట్టర్ ఇలా ట్వీట్ చేశారు..‘‘మాజీ గవర్నర్,మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి మృతి తీరని విషాదం. ఆయన రాజకీయాలలో భీష్మాచార్యుడి వంటి వారు.ప్రజా జీవితంలో రోశయ్య గారు ఒక మహోన్నతనేత.
రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడంలో ఆయన ఓ రుషిలా సేవ చేశారు. వివాదరహితులుగా, నిష్కళింకితులుగా ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి రోశయ్యగారు . ఆయన కన్నుమూయడంతో రాజకీయాలలో ఓ శకం ముగిసింది. రోశయ్య గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’’ అంటూ నివాళి అర్పించారు. రోశయ్య కన్నుమూతతో రాజకీయాలలో ఓ శకం ముగిసిందన్నారు మెగస్టార్. ఆయన కటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశాడు చిరంజీవి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…