Rajamouli: చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో రాజమౌళి ఒకరు. ఈయన సినిమాలన్నీ కూడా చాలా విభిన్నంగా ఉంటాయి. పురాణ ఇతిహాసాల ఆధారంగా సినిమాలను చేస్తూ ఉంటారు. దీంతో ఈయనకు ఇలాంటి ఇతిహాసాల గురించి పూర్తిస్థాయిలో నాలెడ్జ్ ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని ఎప్పటికైనా మహాభారతం చేయాలి అని పలు సందర్భాలలో వెల్లడించారు.
ఇలా పురాణ ఇతిహాసాల గురించి ఎంతో మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి రాజమౌళి ఇటీవల రాముడు రావణుడు గురించి మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈయన దర్శకత్వ ప్రతిభను ఆధారంగా నెట్ ఫ్లిక్స్ ఒక స్పెషల్ డాక్యుమెంటరీని చిత్రీకరించిన సంగతి తెలిసిందే.మోడ్రన్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని నెట్ ఫిక్స్ ప్రస్తుతం ప్రసారం చేస్తోంది.
ఇందులో భాగంగా రాజమౌళి తన సినీ కెరియర్ ఎలా సాగిందనే విషయాలని కూడా చూపించారు. ఇందులో భాగంగానే ఈయన రాముడు రావణాసురుడు గురించి మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాముడు ఒక గొప్ప కథానాయకుడు అవుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు కానీ నాకు రావణాసురుడే గొప్ప అనిపిస్తుందని తెలిపారు.
నా దృష్టిలో కథానాయకుల కంటే విలన్లకే అధిక ప్రాధాన్యత ఇస్తానని, విలన్ అంటే తనని ఓడించడం హీరోలకు చాలా కష్టం అనిపించాలి.ఆ విషయంలో తనకి రావణుడి పాత్రే ఇష్టం అని రాజమౌళి అన్నారు. ఇలా రాజమౌళి రావణుడి పాత్ర నాకు ఇష్టమని చెప్పడంతో పలువురు ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.
అర్జునుడు కంటే కర్ణుడు గొప్పా…
ఇటీవల ప్రేక్షకుల ముందుకు ప్రభాస్ నటించిన కల్కి చిత్రం వచ్చింది. ఇక ఇందులో కూడా డైరెక్టర్ అర్జునుడి కంటే కర్ణుడే గొప్పవాడు బలవంతుడు అనేలా చూపించడంతో ఈ విషయం గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలోనే రాజమౌళి సైతం రాముడు కంటే రావణాసురుడు అంటే ఇష్టమని చెప్పడంతో ఈ విషయాల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…