Rajasekhar Daughters: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇచ్చి హీరోలుగా ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతుంటారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం వారసురాళ్ల హవా బాగా ఉంది.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి పలువురు వారసురాలు ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేదని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జీవిత రాజశేఖర్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి వీరి కూతుర్లు శివాని, శివాత్మిక హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు.ఇప్పటికే వీరిద్దరూ పలు సినిమాలలో హీరోయిన్లుగా నటించిన కెరియర్లో చెప్పుకోదగ్గ సినిమాలు మాత్రం లేవు. ఇక ఈ హీరోయిన్స్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పెద్దగా సక్సెస్ రాకపోవడంతో ఈ ముద్దుగుమ్మలకు సక్సెస్ వచ్చే హీరో లేరా అనే వార్తలు వినపడుతున్నాయి.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వీరి తండ్రి స్టార్ హీరో, తల్లి నటిగా, దర్శకురాలుగా సొంత నిర్మాణ సంస్థను స్థాపించి ఎన్నో సినిమాలు చేశారు. అయినా ఈ స్టార్ కిడ్స్ కెరియర్ మాత్రం స్లోగానే ఉంది. ఇలా వీరికి ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడానికి కారణం టాలీవుడ్ సెలబ్రిటీ కిడ్స్ కావడమే. జీవిత రాజశేఖర్ ఎన్నో కుటుంబ కథా సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించారు.
ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్లో గ్లామర్ షో చేస్తే తప్ప ఇండస్ట్రీలో నిలబడటం కష్టతరమవుతుంది. అయితే జీవిత రాజశేఖర్ ఎన్నో మంచి సినిమాలలో నటించి వారి కూతుర్లు గ్లామర్ షో చేస్తే పెద్ద ఎత్తున నేటిజెన్ల నోటి దురుసుకి బలి కావాల్సి ఉంటుంది. తద్వారా ఈ హీరోయిన్స్ గ్లామర్ షోకు దూరంగా ఉండడంతో వీరికి సినిమా అవకాశాలు కూడా రాకుండా ఉన్నాయని తెలుస్తోంది.ఇలా సినిమాలలో పెద్దగా సక్సెస్ అందుకోకపోయినా ఈ హీరోయిన్లకు వెబ్ సిరీస్ ఎంతో బెటర్ అనే సలహాలు కూడా వస్తున్నాయి. మరి ఆ దిశగా వెళ్లి సక్సెస్ అవుతారా లేకపోతే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…