Movie News

Rao Ramesh: మేకప్ మెన్ కుటుంబానికి అండగా రావు రమేష్.. 10 లక్షల ఆర్థిక సాయం!

Rao Ramesh: రావు రమేష్ సీనియర్ నటుడు రావు గోపాల్ రావు వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈయన ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు.ఇలా ఈయన ఎన్నో సినిమాలలో తండ్రి పాత్రలలోను విలన్ పాత్రలలోను నటిస్తూ పెద్ద ఎత్తున తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఇలా వరుస తెలుగు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి రావు రమేష్ తన మంచి మనసును చాటుకున్నారు.గత కొద్ది రోజుల క్రితం రావు రమేష్ పర్సనల్ మేకప్ బాబు అనారోగ్యంతో మృతి చెందిన విషయం మనకు తెలిసిందే.గత కొన్ని సంవత్సరాల నుంచి తన దగ్గర పని చేస్తున్నటువంటి బాబు మృతి చెందడంతో రావు రమేష్ ఎంతో విచారం వ్యక్తం చేశారు.

ఈ విధంగా తన మేకప్ మెన్ చనిపోవడంతో ఈయన తన కుటుంబానికి అండగా నిలబడి ఏకంగా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.ఈ క్రమంలోని ఈయన స్వయంగా బాబు ఇంటికి వెళ్లి తన కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి పది లక్షల రూపాయలు అందజేశారు. ఇలా తన కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా తన కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చిన అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.

Rao Ramesh: ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్..

ఇలా తన కోసం పని చేసిన వ్యక్తి చనిపోవడంతో ఆ కుటుంబాన్ని కష్టకాలంలో ఆదుకున్నటువంటి ఈయన మంచి మనసుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.రావు రమేష్ సినిమాలలో విలన్ పాత్రలలో నటించినప్పటికీ ఈయన మనసు మాత్రం చాలా మంచిది అంటూ నేటిజన్స్ ఈయనని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రస్తుతం ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago