ఈ ఏడాది జనవరిలో మా డైరీ ఆవిష్కరణ లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు… రాజశేఖర్ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు చిరంజీవి. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన చిరంజీవి మాట్లాడే సమయంలో పలుమార్లు అడ్డుపడ్డారు రాజశేఖర్. ఒకానొక సమయంలో మైక్ లాక్కునేందుకు ప్రయత్నించిన రాజశేఖర్ పై చిరు అసహనానికి గురైన విషయం తెలిసిందే. దీనిపై అదే సభలో చిరు రాజశేఖర్ పై ఘాటు వ్యాఖలే చేసారు. ఆ సభకు హాజరైన మిగిలిన అతిధులు కూడా ఈ విషయంపై రాజశేఖర్ ను తప్పుపట్టారు.
రాజశేఖర్ పై క్రమశిక్షణ కమిటీ కూడా వేశారు. అదేరోజు కోపంతో తన ఎగ్జిక్యూటివ్ పదవికి రాజినామా చేసారు హీరో రాజశేఖర్. ఇది జరిగి నెలలు గడుస్తున్నా రాజశేఖర్ కు చిరు మీద కోపం పోయినట్టులేదు. తాజాగా మరోసారి రాజశేఖర్ చిరుని టార్గెట్ గా అనిపిస్తుంది. ప్రత్యక్షంగా కాకపోయినా చిరుని రాజశేఖర్ పరోక్షంగా టార్గెట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.
తాజగా రాజశేఖర్ నటించిన “అర్జున” చిత్రం మూవీ ట్రైలర్ రిలీజ్ చేసారు. ఇందులో “పార్టీ ఓపెన్ చేయగానే టికెట్లు అమ్ముకుని, పని అయిపోయాక పార్టీ అమ్ముకోడానికి కాదురా పెట్టింది పార్టీ” అనే డైలాగ్ రాజశేఖర్ చెప్పడంతో… ఈ డైలాగ్ చిరుని ఉద్దేశించే రాజశేఖర్ ఈ డైలాగ్ చెప్పాడన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో అసలు నిజం ఏంటో రాజశేఖర్ ఆండ్ కో..కె తెలియాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…