Featured

Rajeev Kanakala : సుమతో నాకు గొడవ టామ్ అండ్ జెర్రీ ఫైట్ లా ఉంటుంది : రాజీవ్ కనకాల

Rajeev Kanakala : దేవదాస్ కనకాల గారి అబ్బాయి గా ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైన రాజీవ్ కనకాల మొదట టీవీ రంగంలోకి అడుగుపెట్టాడు, ఆ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలుత దూరదర్శన్ ఛానెల్ లో పనిచేసిన రాజీవ్ కనకాల ఆ తరువాత పలు సీరియల్స్ లో నటించారు. అప్పుడు ఏర్పడిన పరిచయంతో యాంకర్ సుమ ను ప్రేమించి పెళ్లాడారు. ఇక సినిమాల్లో కూడా విలన్ పాత్రలను, సహాయక పాత్రలను చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజీవ్ ప్రస్తుతం చాలా తక్కువగా సినిమాలను చేస్తున్నారు. ఇక సుమకు రాజీవ్ కనకాలకు గొడవలు, విడిపోతున్నారు అంటూ జరిగిన ప్రచారంలో ఉన్న వాస్తవలను అయన తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ప్రస్తావించారు.

మా గొడవ టామ్ అండ్ జెర్రీ లా ఉంటుంది…

చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజీవ్ ‘ఋతురాగాలు’ సీరియల్ లో శ్రీధర్, పృథ్వీ పాత్రలతో బాగా ఫేమస్ అయ్యాడు. ఎక్కడికి వెళ్లినా ఆ సమయంలో పృథ్వీ అంటూ పిలిచేవారట. ఇక సినిమాల్లో నటించేప్పుడు సుమ కూడా యాంకర్ గా మంచి ప్లేసులో ఉన్న సమయంలో ఇద్దరూ కలిసి సినిమా చేయాలని అనుకుని కథ సిద్ధం చేసాక ప్రొడ్యూసర్ ఎవరూ దొరక్క ఆగిపోయామని, ఆ సినిమాలో మా పాత్రలు టామ్ అండ్ జెర్రీ లా గొడవ పడే పాత్రలు అంటూ రాజీవ్ పంచుకున్నారు.

ఇక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ సుమ నేను చిన్న చిన్న గొడవలు పడటమే కానీ పెద్ద గొడవలు, మనస్పర్తలు ఏమి లేవు అంటూ మాట్లాడారు రాజీవ్. నాకు కోపం వచ్చి ఒక మాట అన్నా వెంటనే మళ్ళీ సారీ చెప్పి మామూలుగా ఉంటాను. కానీ సుమ కి కోపం వస్తే అస్సలు త్వరగా మాట్లాడదు. కొన్ని రోజులైనా అలాగే ఉంటుంది మొండిది అంటూ చెప్పారు. కొడుకు రోషన్ ను సినిమాల్లోకి లాంచ్ చేయాలని అనుకున్నా తన వయసుకు తగ్గ కథ దొరకలేదని చెప్పారు.

Bhargavi

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

2 days ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

2 days ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

2 days ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

2 days ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

4 days ago