Movie News

భర్తతో విడిపోయిన డింపుల్ కపాడియా.. కానీ విడాకులు ఇవ్వలేదట.. ఎందుకంటే?

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ డింపుల్ కపాడియా. ఎన్నో సినిమాలలో నటించిన ఈమె ఎక్కువగా హిందీ భాషలో నటించింది. అంతేకాకుండా తమిళ, మలయాళ భాషలో కూడా నటించింది. తన నటనకు ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. 1973లో బాబి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన డింపుల్ తొలి నటనకే మంచి గుర్తింపు అందుకొని ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో నటించింది.

2015 వెల్ కమ్ బ్యాక్ సినిమాలో చివరి సారిగా నటించగా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఈమె 1973లోనే సినీ నటుడు రాజేష్ ఖన్నా ను పెళ్లి చేసుకుంది. వీరికి ట్వింకిల్, రింకీ అనే ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈమె రాజేష్ కన్నా తో 1982లో విడిపోయింది. తన కూతురును కూడా నటులుగా చేసింది. ఇక తన పెద్ద కుమార్తె ట్వింకిల్ ఖన్నా అక్షయ్ కుమార్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తన భర్తతో విడిపోయిన తర్వాత కూడా విడాకులు ఇవ్వలేదట.

తన భర్త తో విడిపోయిన తర్వాత తనకు కష్టకాలంలో సన్నీ డియోల్ అండగా నిలబడ్డాడు. ఇక వీరి మధ్య సన్నిహితం బాగా వైరల్ గా మారింది. ఇక దర్శక నిర్మాతలు కూడా వీరి మధ్య ఎఫైర్ ను క్యాష్ చేసుకునేందుకు ఈ జంటను ఎంచుకునేవారట. డింపుల్ తో సన్నిహితంగా ఉంటున్నందుకు సన్నీ డియోల్ భార్య అప్పట్లో గొడవ కూడా చేసిందట. ఇక ఆ సమయంలో డింపుల్ ఆమెకు విడాకులు ఇవ్వమని సన్నీని కోరిందట. కానీ అతను విడాకులకు ఇష్టపడకపోవడం తో డింపుల్ కూడా తన భర్తకు విడాకులు ఇవ్వద్దని నిర్ణయం తీసుకుందట.

నిజానికి డింపుల్, రాజేష్ కన్నా మధ్య ఎటువంటి భేదాలు లేవట. ఏ రోజు కూడా ఒకరి ఇష్టాలకు మరొకరు అడ్డు చెప్పలేదట. ఇక వీళ్ళు బయట కలుసుకున్నప్పుడు ఫ్రెండ్స్ లా మాట్లాడుకుంటారట. తన భర్త ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేసిన సమయంలో కూడా తన వంతు ప్రచారం చేసిందట డింపుల్. ఇక ఆయన ఈ ఏడాది అనారోగ్యానికి గురైనప్పుడు కూడా తన వద్దే ఉండి బాధ్యతలు తీసుకుందట డింపుల్.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago