Rakul preeth singh: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా నటిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అలాగే సౌత్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈమె ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమైనటువంటి రకుల్ అక్కడ నటుడు నిర్మాత జాకీ భగ్నాని అనే వ్యక్తిని ప్రేమించిన సంగతి మనకు తెలిసిందే. గత రెండున్నర సంవత్సరాల కాలం క్రిందట వీరు తమ ప్రేమ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నామనే విషయాన్ని అధికారకంగా ప్రకటించిన తర్వాత ఇద్దరు కూడా చట్టాపట్టాలేసుకొని స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు.
ఇకపోతే కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన తర్వాత వీరిద్దరూ శుభవార్తను తెలియజేశారు అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ గా మారింది. ప్రస్తుతం థాయిలాండ్ లో వీరిద్దరూ బ్యాచిలర్ పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారట. అయితే బాలీవుడ్ సమాచారం ప్రకారం వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నటువంటి తరుణంలోనే బ్యాచిలర్ పార్టీ ఇచ్చారు అంటూ వార్తలు వస్తున్నాయి.
గోవాలో వివాహం…
రకుల్ జాకీ ఇద్దరు కూడా ఫిబ్రవరి 22వ తేదీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని సమాచారం. ఇక వీరి పెళ్లి గోవాలో కేవలం అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతుందని తెలుస్తోంది. ఇలా వీరి పెళ్లి గురించి ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ రకుల్ మాత్రం అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…