Venu Swamy: వేణు స్వామి టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీల గురించి అలాగే రాజకీయ నాయకుల గురించి పెద్ద ఎత్తున జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఇలా ఈయన చెప్పే జాతకాలపై ఇదివరకు ఎన్నోసార్లు విమర్శలు కూడా వచ్చాయి. ఇలా వేణు స్వామి చెబుతున్నటువంటి జాతకాలు కొంత నిజమైనప్పటికీ మరికొన్ని నిజం కాకపోవడంతో ఈయన పట్ల నేటిజన్స్ విమర్శలు చేస్తున్నారు.
ఇక కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి తరుణంలో వేణు స్వామి పలువురు సినీ సెలబ్రిటీల జాతకాలను తెలియజేశారు. ఇందులో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఒక యాంకర్ వ్యక్తిగత సమస్యలన్నీ కూడా బయటపడతాయని ఈయన తెలిపారు. ఆమె సమస్యలు విని అందరు షాక్ అవుతారని వెల్లడించారు.
ఇక ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి ఒక హీరో ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నారని ఆయన అనారోగ్య సమస్యల కారణంగా నటించలేని పొజిషన్ కి వెళ్తారని అందుకే రిటైర్మెంట్ ప్రకటిస్తారంటూ కూడా వేణు స్వామి ఈ సందర్భంగా తెలిపారు.
ఆ ముఖ్యమంత్రికి పదవీ గండం…
ఇక ఈ ఇంటర్వ్యూలో ఈయన రాజకీయ నాయకుల గురించి కూడా తెలిపారు. తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి పదవీగండం ఉందని ఆయన పదవి విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్లో మరోసారి కూడా జగన్మోహన్ రెడ్డి అధికారం అందుకుంటారని వేణు స్వామి తెలిపారు. తెలంగాణలో కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు వ్యాపారవేత్తలు జైలుకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…