Movie News

Shivaji: బిగ్ బాస్ విన్నర్ కంటే నేనే ఎక్కువగా సంపాదించాను.. రెమ్యూనరేషన్ లీక్ చేసిన శివాజీ?

Shivaji: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేశారు నటుడు శివాజీ. ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన తప్పకుండా టైటిల్ గెలుస్తారని అందరూ భావించారు కానీ చివరి వారాలలో ఈయన వ్యవహార శైలి కారణంగా ఓటింగ్ శాతం పూర్తిగా తగ్గిపోయి టాప్ త్రీ కంటెస్టెంట్ గా బయటకు రావాల్సి వచ్చింది.

ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమంలో 15 వారాలపాటు సందడి చేసిన అనంతరం శివాజీ బయటకు వచ్చారు. ఇక బయటకు వచ్చిన తర్వాత ఈయన ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఈ కార్యక్రమం గురించి పలు విషయాలను తెలియజేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు బిగ్ బాస్ కార్యక్రమం గురించి అలాగే రెమ్యూనరేషన్ గురించి కూడా పలు విషయాలను వెల్లడించారు.

తాజాగా శివాజీ మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ అమాయకుడని తనకి ఏమీ తెలియదని తెలిపారు. తనకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ వాటిని ఎలా మానిటైజ్ చేసుకోవాలో తెలియక భారీ మొత్తంలో డబ్బు నష్టపోయారని తెలిపారు. ఇక తానే తన యూట్యూబ్ ఛానల్ మానిటైజింగ్ చేశాను అంటూ శివాజీ తెలిపారు..

ప్రశాంత్ అమాయకుడు…

ఇక బిగ్ బాస్ విన్నర్ గా నిలిచినటువంటి ప్రశాంత్ కంటే తానే ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని ఈయన తెలిపారు. ప్రశాంత్ వారానికి లక్ష రూపాయలకు లోపే రెమ్యూనరేషన్ అందుకున్నారు ఇక ప్రైజ్ మనీతో పాటు మరో రెండు బహుమతులను పొందారు. కానీ శివాజీ మాత్రం హీరోగా ఇండస్ట్రీలో కొనసాగడంతో ఈయన వారానికి నాలుగు లక్షల రూపాయలు అందుకున్నారు. ఇలా 15 వారాలకు ఈయన సుమారు 60 లక్షల వరకు తీసుకున్నారని తెలుస్తుంది. ఎంత తీసుకున్నాను అనే విషయాన్ని శివాజీ చెప్పకపోయినా విన్నర్ కంటే తానే ఎక్కువగా తీసుకున్నాను అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago