Movie News

Rakulpreeth Singh: ఏంటీ… రకుల్ గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుందా… అసలు విషయం చెప్పేసిన నటి రకుల్!

Rakulpreeth Singh: రకుల్ ప్రీతిసింగ్ పరిచయం అవసరం లేని పేరు తెలుగు తమిళ భాషలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలలో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యారు. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి ఈమె పెద్ద ఎత్తున తన వ్యక్తిగత విషయాల వల్ల వార్తల్లో నిలుస్తుంటారు.

సాధారణంగా హీరోయిన్లు ఎవరితోనైనా ప్రేమలో పడితే వారి ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచుతారు కానీ రకుల్ మాత్రం ప్రముఖ బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీభగ్నానితో ప్రేమలో ఉన్న విషయాన్ని అధికారకంగా ప్రకటించారు ఇలా ఈమె ప్రేమ విషయం గురించి చెప్పడంతో తరచూ ఈమె బయటకు వెళ్లిన ప్రతిసారి మీడియా తన పెళ్లి గురించి ప్రశ్నిస్తూ తనని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

ఇలా తరచు తన పెళ్లి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో ఈ పెళ్లి వార్తలపై ఒకానొక సమయంలో తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.అయితే ఈమె పెళ్లి గురించి ఇలాంటి వార్తలు రావడానికి గల కారణం ఈమె సోదరుడు ఆమన్ అని చెప్పాలి. ఈయన సోషల్ మీడియా వేదికగా రకుల్ ప్రీతిసింగ్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతుందని పోస్ట్ చేయడంతో ఈ పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి.

Rakulpreeth Singh: గత ఏడాది నా పెళ్లి జరిగింది…

తాజాగా ఓ మీడియా సమావేశంలో భాగంగా రకుల్ ప్రీతిసింగ్ తన పెళ్లి గురించి స్పందించారు.ప్రతివారం నా పెళ్లి గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది మీ కథనం ప్రకారం నాకు గత ఏడాది నవంబర్ నెలలోనే పెళ్లి జరిగిపోయింది అయితే నా పెళ్లి ఎక్కడ ఎలా జరిగిందో మాత్రం నాకు తెలియదు అంటూ ఈమె తన పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రకుల్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago