యావత్ భారతదేశం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం RRR. దర్శక ధీరుడు రాజమౌళి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బడా నిర్మాత డివివి దానయ్య భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన నాటు నాటు సాంగ్, జనని సాంగ్ మెగా, నందమూరి రెండు లుక్స్ అభిమానులను సందడి చేశాయి. సినిమాలో హై థ్రిల్లింగ్ మూమెంట్స్, హీరో ఇంట్రడక్షన్స్, ఇంటర్వెల్ సీక్వెన్స్‌లు, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ సీక్వెన్స్‌లు, క్లైమాక్స్ సీన్స్ అన్నీ అంతర్లీనంగా సాగుతాయని అభిమానులకు జక్కన్న ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
సినిమా మొత్తం ఆ ఎమోషనల్‌లోనే దాగి ఉంటుందని అంటున్నారు. థియేటర్లలో చూసి ప్రేక్షకులు చాలా థ్రిల్ అవుతారని అన్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో తాను మూడు గెటప్ లో కనిపిస్తానని చెప్పాడు. నా పాత్ర మూడు సరికొత్త లుక్స్‌తో ఉంటుందన్నారు. ఇక రాజమౌళి సినిమాలో ఒక క్యారెక్టర్ చేయడం అదృష్టంగా భావించే తనకు మూడు క్యారెక్టర్లు చేయడమంటే.. ఇంత కంటే గొప్పది మరొకటి ఉండదన్నారు.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో షూటింగ్, ఆచార్య మూవీ షూటింగ్, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ షూటింగ్స్‌కి చిన్న బ్రేక్ ఇచ్చి, తన సోదరి శ్రీజతో కలసి స్విట్జర్లాండ్ వెళ్లారు. అక్కడ ఎత్తైన కొండల్లో ఫ్యామిలీతో ఫొటో దిగాడు. ఆ ఫొటో సోషల్ మీడియలో వైరల్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…