మొదట బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన 19 మంది కంటెస్టెంట్లలో ఎక్కువగా పరిచయం లేని వాళ్లే ఉన్నారు. అయితే అందులోకూడా పరిచయం ఎక్కువగా ఉన్నవాళ్లు దాదాపు బయటకు వచ్చారనే చెప్పాలి. అయితే హౌస్ లో కి ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టిన సన్నీకి.. ఐదు వారాలు అయిపోయిన తర్వాత అతడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
మొదటి ఐదు వారాలు షణ్ముఖ్ జశ్వంత హాట్ ఫేవరెట్ గా ఉండగా.. అతడిని సన్నీ ఓట్ల పరంగా దాటేశాడనే చెప్పాలి. ఈ విషయం మొన్న ఫ్యామిలీ సభ్యులు వచ్చిన సమయంలో స్పష్టంగా అర్థం అయింది. టాప్ లో ఎవరు ఉంటారో టాప్ 5 మెంబర్స్ ను చెప్పమనగా చాలామంది సన్నీని టాప్ లో చూపించారు. దీంతో హౌస్ లో ఉన్న సభ్యులకు కూడా సన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని అర్థం అయిపోయింది.
దీంతోనే కాజల్ లాంటి వాళ్లు అతడితో స్నేహం చేయడం ప్రారంభించారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో అందరి డ్రెస్సింగ్ స్టైల్ కంటే.. సన్నీ స్టైల్ వెరైటీగా ఉంటుంది. పూల చొక్కాలు.. బొమ్మల బొమ్మల ప్రింటింగ్.. తలపై టోపీ ఇవన్నీ సన్నీకి సూట్ అయినట్టుగానే ఉంటూ ఫన్ జనరేట్ అయ్యేలా ఉంటాయి. అయితే సన్నీకి వారం వారం బట్టలు డిజైన్ చేసి పంపడం కోసం బయట ఒక గ్రూప్ ఉందట.
ఇలా వారం వారం అతడి డ్రెస్స్ కు డిజైన్ చేసి పంపేది మేమే అంటూ.. అతని స్నేహితుడు నరేష్ అన్నాడు. సన్నీకి పూల చొక్కాలు బాగా సెట్ అవుతున్నాయి. అందుకే అలాంటి వాటినే ప్రిఫర్ చేస్తున్నామన్నాడు. ఇక సన్నీకి ఎలాంటి లవ్ స్టోరీ లేదని.. వాళ్ల అమ్మ చూపించిన అమ్మాయిని మాత్రమే చేసుకుంటానని తన అమ్మ (కళావతి)కి మాట ఇచ్చాడని చెప్పాడు. అతడి పెళ్లి విషయం మొత్తం వాళ్ల అమ్మదే అంటూ చెప్పుకొచ్చాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…