మెగస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు సినిమాలు సంతకాలు చేసే పనిలో నిమగ్నం అయ్యడు. వరస పెట్టి.. రెస్ట్ లేకుండా మూవీలను చేస్తున్నాడు. ప్రస్తుతం ఆచార్య మూవీ చివరిదశకు చేరుకోగా.. తాజాగా అతడు భోళా శంకర్, గాడ్ ఫాదర్, మెగా 154 సినిమాలకు పూజా కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించాడు. ఊటీలో ‘గాడ్ ఫాదర్’ షెడ్యూల్ పూర్తికాగా.. ఇటీవల హైదరాబాద్‌లో ‘భోళా శంకర్’ షూటింగ్ ప్రారంభమైంది.
ఆచార్య మూవీ విడుదల కాక ముందే భోళా శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే ఇటీవల ఆ సినిమాకు సంబంధించి మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. ఇక ఆ సినిమా షూటింగ్ లో ఉండగానే.. మరో సినిమాను ప్రారంభించాడు.
ప్రముఖ దర్శకుడు బాబీ ఆధ్వర్యంలో మెగా 154 సినిమాను ప్రారంభించాడు. నిన్న చిరంజీవి మెగా 154 మొదటి రోజు షూట్‌లో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని బాబీ సోషల్ మీడియాలో ద్వారా షేర్ చేశాడు. మెగాస్టార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల వెనుక కారణం సినీ పరిశ్రమపై ఆధారపడిన ప్రజలకు మరింత పని కల్పించడమే అని కొందరు అంటున్నారు.
అందుకే ఏకంగా మూడు సినిమాలు చేస్తున్నాడని టాక్. మెగా 154లో మాస్ మహారాజా రవితేజ చిరంజీవికి సోదరుడిగా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాకు వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ఇక మొదటి రోజు చిరంజీవి మీద సీన్స్ తెరకెక్కించడంతో ఎంతో థ్రిల్లింగ్ గా ఉందని అతడు ఆనందం వ్యక్తం చేశాడు. ఎన్నో రోజుల నుంచి ఈ సమయం కోసం వెయిట్ చేశానని.. ప్రస్తుతం అది నెరవేరిందని అన్నాడు బాబీ.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…