Ram Charan: సినీ పరిశ్రమలో అతడే స్పూర్తి.. ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Ram Charan: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దీనిని దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరి 7, 2022న ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో విడుదల చేయనున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లు నడుస్తున్నాయి. మొన్న ముంబాయ్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. తాజగా తమిళనాడులో జరిగింది.
ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్న విషయం విధితమే. తాజాగా రామ్ చరణ్ ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
రామ్ చరణ్ తండ్రి చిరంజీవి తనకు ఇచ్చిన ఓ ఉత్తమ సలహా గురించి మాట్లాడారు. కెరీర్ సుదీర్ఘకాలంగా కొనసాగాలంటే.. క్రమశిక్షణ అవసరం అని.. అదే విషయాన్ని తనకు సూచించాడని చెప్పాడు. ఇక తనకు సుదీర్ఘ కాలంగా సినీ పరిశ్రమలో ఎలా కొనసాగాలో తెలిపేందుకు నాకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్ఫూర్తి అన్నారు.
అక్షయ్ కుమార్ వయస్సుతో సంబంధం లేకుండా.. ఫిట్‌గా.. ఎనర్జిటిక్‌గా విజయవంతంగా కొనసాగాలంటే.. తాను అక్షయ్ కుమార్ నే ఎక్కువగా ఫాలో అవుతానన్నారు. ఇక చిరంజీవితో కలిసి ఇతడు నటిస్తున్న చిత్రం ఆచార్య.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతే కాదు.. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్.. రెండు నుంచి మూడు ప్రాజెక్ట్ లను ఒప్పుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…