Upasana: సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇలా మెగా కుటుంబం నుంచి హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి వారిలో నటుడు రామ్ చరణ్ ఒకరు. ఈయన మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నారు.
ఇక రాంచరణ్ ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేనటువంటి ఉపాసనని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కూడా తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక ఉపాసన ప్రముఖ బిజినెస్ ఉమెన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఈమె అపోలో హాస్పిటల్ వ్యవహారాలను మాత్రమే కాకుండా ఇతర వ్యాపారాలను కూడా ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు.
బిజినెస్ ఉమెన్ గా ఉపాసన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఉపాసన ఆస్తుల వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉపాసన బిజినెస్ నడుపుతూ భారీ స్థాయిలోనే ఆస్తులను కూడా పెట్టారని తెలుస్తుంది. పలు నివేదికల ప్రకారం కేవలం ఉపాసన పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు విలువ సుమారు 1130 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తుంది.
ఆదర్శంగా నిలిచిన ఉపాసన..
కేవలం ఉపాసన మాత్రమే ఈ స్థాయిలో ఆస్తులు సంపాదించారు అంటే ఇక మెగా ఫ్యామిలీ కూడా ఏ రేంజ్ లో ఆస్తిపాస్తులను సంపాదించి ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఒక కోడలిగా, భార్యగా, ఒక తల్లిగా, ఒక వ్యాపారవేత్తగా ఉపాసన ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…